–డిసిసి అధ్యక్ష పదవి ఆశించానన్న మోహన్ రెడ్డి
Gummala Mohan Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించిన ప్రకటించిన కార్యవర్గంలో నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మో హన్ రెడ్డికి ఉపాధ్యక్ష పదవి వరిం చగా సదరు పదవి పట్ల గుమ్మల మోహన్ రెడ్డి విముఖత వ్యక్తం చేశారు. తనకు ఈ పదవి వద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పి సిసి అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డికి తెలిపానాని తాను నల్గొండ జిల్లాలో నిరంతరం ప్రజల పక్షాన ఉంటానా ని తనకు అవకాశం ఉంటే డిసిసి అ ధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. గురువారం మంత్రి క్యాంప్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాం గ్రెస్ పార్టీలో అనేకమంది సీనియర్ నాయకులు ఉన్నారని వారికి పిసిసి ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలని తనకు ఆ పదవిపై ఇష్టం లేదన్నారు.
తాను రాజీనామా చేయలేదని తా ను కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరునిగా ఆయన ఆదేశాలను పాటిస్తూ నిరంతరం పా ర్టీకి సేవ చేస్తానన్నారు. తాను తన కు డిసీసీ పదవి ఇవ్వకునా కార్య కర్తగానే పనిచేస్తానని స్పష్టం చేశా రు. మంత్రిని విడిచి నేను ఎక్కడికి వెళ్లే ప్రశ్న లేదన్నారు కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత నల్లగొండ ని యోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆధ్వర్యం లో అభివృద్ధి పనులు శరవేగంగా న డుస్తున్నాయని మరో ఆరు నెలల లో ఫలితాలు కనపడతాయన్నారు. 565 హైవే రోడ్డు . ఇందిరమ్మ ఇం డ్లు డబల్ రూములు లబ్ధిదారులకు ఇవ్వడం కి సిద్ధంగా ఉన్నాయన్నా రు. అలాగే బీటీ రోడ్లు సిసి రోడ్లు వాటర్ ట్యాంకులు సబ్ స్టేషన్లు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమా లు నడుస్తున్నాయన్నారు. గత పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో నల్లగొండ వెనుకబడిపోయిందని అన్నారు.
ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాస్ రెడ్డి మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ నా యకులు శ్రీనివాస్ కత్తుల కోటి తది తరులు పాల్గొన్నారు.