–డిసిసి అధ్యక్ష పదవిపై నిరాశ నిస్పృహలు
–రెడ్డి కులమే నా పదవిని లాగేసు కుంది
–ఎవరిని నొప్పించకుండా పనిచే స్తుంటే నన్నే పక్కకు పెట్టారు
–రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో వలస నాయకులకే పెద్దపీట
–మానాన్న ఎమ్మెల్యే, ఎంపీనో ఐతే నాకూఎమ్మెల్యే పదవి వచ్చేది
–మంత్రి కోమటిరెడ్డి అనుకుంటే 24 గంటల్లో ఆర్టీసీచైర్మన్ అట్టే వస్తుంది
–కాలమే సమాధానం చెబుతుం దని తీవ్ర వ్యాఖ్యలు
–మీడియా సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి
Gummula Mohan Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ని యామకంపై రాజకీయ రచ్చ చెల రేగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డిగా గంపెడాశ పెట్టుకున్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షడు గుమ్ముల మోహ న్ రెడ్డి పార్టీ అధిష్టానంపై కస్సుబు స్సు లాడాడు. తనను వరిస్తుంద నుకున్న డిసిసి పదవి పున్న కైలాష్ నేతను వరివచడంతో గుమ్ముల కి నుక వహించాడు. ఈ మేరకు ఆ యన ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రైవేట్ క్యాంప్ కార్యా లయంలో ఏర్పా టు చేసిన మీడి యా సమావేశంలో డిసిసి పీఠం మి స్ కావడంపై రుసరుసలాడాడు.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జి ల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పదవు ల పందేరంపై అందరి మాదిరిగానే నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షడు గుమ్ముల మోహన్ రెడ్డి ఆశ పెట్టు కున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అన్ని జిల్లాలకు ఏఐసీసీ శ నివారం ఏఐసీసీ శనివారం రాత్రి డీ సీసీ అధ్యక్షులను ప్రకటించిన నేప థ్యంలో అధ్యక్ష పదవిపై ఎన్నో ఆశ లు పెట్టుకున్న గుమ్మల మోహన్ రె డ్డికి ఆశలు అడియాశలయ్యాయి. తనకు అధిష్టానం మొండి చేయి చూపుతూ డీసీసీ అధ్యక్ష పీఠం పు న్న కైలాస్ నేతను నిర్ణయించడంతో గుమ్ముల మోహన్ రెడ్డి అగ్రహోద గృడయ్యాడు. పలువురు ఉమ్మడి జిల్లా సీనియర్ నేతల ప్రమేయంతో పున్న కైలాస్ నేత జిల్లా కాంగ్రెస్ అ ధ్యక్షుడిగా నియాకమయ్యారు. దీం తో ఆయన అధిస్థానం, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పై ఘాటైన వ్యా ఖ్యలతో బాణాలు ఎక్కుపెట్టారు.
నల్లగొండ ముఖ్యనేతలతో కలిసి ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ అవకాశం వచ్చిన ప్పుడల్లా డిసిసి పదవి అడిగినా మంత్రి కోమటిరెడ్డి అనుచరడనే కా రణం, కులం కార్డు కారణంగా తన కు పదవి దూరమైందని వ్యాఖ్యా నించారు. కులం నా డీసీసీ పదవిని లాక్కుందని, కాంగ్రెస్ పార్టీలో వా ర్డు మెంబర్ కాకున్నా డీసీసీ కావొవ చ్చునని గుర్తు చేశారు. సీనియారి టీ, నా సర్వీస్ ఎందుకు పనికిరాలే దని, ఎవరిని నొప్పించకుండా రాజ కీయాలు చేస్తే చివరికి తననే పక్క కు పెట్టారని విచారం వ్యక్తం చేశా రు.
గతంలో అవసరమైనప్పుడు 5వేల మందితో ర్యాలీ తీశానని, మా నా న్న ఎమ్మెల్యే, ఎంపీ నో అయితే నా కు ఎమ్మెల్యే పదవి వచ్చేదంటూ జి ల్లాలోని పలువురు నాయకుల ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.తాను నమ్మిన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఇ ది కాదని, రెడ్డి కులం డీసీసీకి అడ్డు అయితే ఆ విషయం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తీవ్ర స్వరంతో వె ల్లడించారు. పార్టీ లైన్ దాట కుండా పని చేయడం కోమటిరెడ్డి నేర్పార ని, అదే పద్ధతిలో భవిష్యత్తులో రా జకీయాలు ఉంటాయని ఓ విధంగా అధిష్టానానికి హెచ్చరికలు జారీ చే శారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నల్లగొం డలో సభ పెడితే తానే ముందు న్నానని, భుజం మీద చేయి మరీ తన గొంతుకోశాడని తీవ్ర విమర్శలు గుప్పించాడు. సీఎం దగ్గర ఉన్న ప టేల్ రమేశ్ రెడ్డికి పర్యాటక కా ర్పొ రేషన్ పదవి వచ్చిందన్నారు. రేవం త్‌కు దగ్గరగా ఉన్న చామల కిరణ్ కుమార్‌రెడ్డి, రఘువీర్ రెడ్డి ఇద్దరు ఎంపీలు అయ్యారని, నియోజకవ ర్గం మొత్తం నా పేరు డీసీసీకి ఓకే అన్నారని,అధిష్టానం మాత్రం కులం పేరు చెప్పి అడ్డుకుందని తీవ్ర స్వ రంతో వ్యాఖ్యానించారు. తన త ర్వాత వచ్చిన 20 మందికి కార్పొ రేషన్ పదవులు ఇచ్చారని, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇస్తానని చెప్పినా వ ద్దని చెప్పానన్నారు. గత రెండు సం వత్సరాల నుంచి కాంగ్రెస్‌లో వలస నాయకులకే పెద్దపీట వేశారని ఆరో పించారు. కాంగ్రెస్ పార్టీ నష్టం చేసే వాళ్లను రోడ్డు మీద దొరికిచ్చుకుని కొడతామని, కోమటిరెడ్డి తలుచు కుంటే 24 గంటల్లో ఆర్టీసీ చైర్మన్ ప దవి తనకు వస్తుందన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డికి తాను సపోర్ట్ చేయలేదని, ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయలేదని గుర్తు చేశారు. తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరు తున్నానని, దేవుడిలా నమ్ముకున్న నాయకుడే న్యాయం చేస్తాడని భా విస్తున్నానన్నారు. ఆర్థిక ఇబ్బందు లు వచ్చినా, మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయినా జెండా వదల్లేదని, రే వంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇద్ద రి కీ చెబుతున్నామని, పార్టీకి నష్టం చే సేవారిని వెంట తిప్పుకుంటే ఎట్టి ప రిస్థితుల్లో ఒప్పుకోమని హెచ్చరిం చారు.
బీసీ సర్పంచుల విషయంలో పార్టీ పరంగా 50 శాతం రిజర్వేషన్లు ఇ స్తామని, కాంగ్రెస్ పార్టీలో ఎవరి వెం ట తిరిగితే వాళ్ల బ్యాచ్ అంటు న్నా రని, రేవంత్ వెంట తిరిగితే నాకు ఎమ్మెల్యే, ఎంపీ పదవి వచ్చేదని ఎ ద్దేవా చేశారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని వ్యా ఖ్యానించారు. ఈ మీడియా సమా వేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అ బ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పి టి సి వంగూరి లక్ష్మయ్య, యాదగిరి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Nalgonda congress leader gummula MohanReddy hot comments pic.twitter.com/G53HEgY1B4
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) November 23, 2025
