–పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి
Gummula Mohan Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: విద్యార్థులు ఎన్ఎస్ యూ ఐ బలోపేతంతో పా టు చదువుకు ప్రాధాన్యత ఇవ్వా లని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి (Gummula Mohan Reddy) అన్నారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఎన్ ఎస్ యూ ఐ (NSUI )సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఎం ఎస్ యు విద్యార్థుల రాజకీయాలకు తొలిమెట్టని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress party) అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్ యుఐలో పనిచేసే విద్యార్థులు క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఎన్ఎస్ యుఐ విద్యార్థి సంఘంలో క్రమశిక్షణతో పని చేస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో మంచి అవకాశం వస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఎన్ఎస్ యుఐ (NSUI ) విద్యార్థుల సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ యుఐ పట్టణ నూతన కమిటీని ప్రకటించి వారికి నియామక పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యుఐ (NSUI ) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి. నాగార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి టి.సాయితేజ్, జిల్లా కార్యదర్శి బైరు ప్రసాద్ , నియోజకవర్గ అధ్యక్షుడు మనిమద్దె సాయిరాం, పట్టణ అధ్యక్షుడు కొండా శరత్, జి సాయి తదితరులు పాల్గొన్నారు.
NSUI పట్టణ నూతన కమిటీ
ఎన్ఎస్ యుఐ నల్గొండ పట్టణ (NSUI Nalgonda Town) నూతన కమిటీని సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. నూతనంగా ఎన్నికైన వారికి నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి నియామక పత్రాలను (Appointment documents) అందజేసి అభినందించారు. ఎన్ఎస్ యుఐ పట్టణ ఉపాధ్యక్షులుగా పి. గురువేందర్, ఎస్.కె అనీఫ్, ప్రధాన కార్యదర్శిగా కే శ్రీకాంత్, సిహెచ్ సంకీర్త్ రెడ్డి, ఆర్, మణికంఠ, కార్యదర్శులుగా సిహెచ్ మీ, వి.వరుణ్ తేజ్, సిహెచ్.సునీల్, కోఆర్డినేటర్లుగా ఎన్.నిఖిల్, వి.సతీష్ లను నియమించారు.