H.M. Kota Mallaiah : ప్రజా దీవెన శాలిగౌరారం : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని శాలిగౌరారం జడ్పి స్కూల్ హెచ్ ఎం కోట మల్లయ్య కోరారు.ముందస్తు బడిబాట కార్యక్రమంలోని భాగంగా మూడవ రోజు ఆదివారం శాలిగౌరారం లో విద్యార్థుల నూతన అడ్మిషన్లకి బడిబాట కార్యక్రమం చేపట్టారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కోరారు.
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు కోట మల్లయ్య విద్యార్థుల తల్లీ దండ్రులకు తెలియజేశారు.ఈ కార్యాక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ ఛైర్మెన్ జమ్ము శ్రీలత, ఉపాద్యాయులు ఎస్ కే ఫజల్ పాషా, వి. శోభా,సైదిరెడ్డి.జ్యోతి పాల్గొన్నారు.