Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Harish Rao : కాళేశ్వరంపై హరీష్ హాట్ కామెం ట్స్, పూర్తి నివేదిక తర్వాత కాంగ్రెస్ సంగతి తేలుస్తాం

Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: కాళేశ్వ రం నివేదికపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుహాట్ హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరo ప్రాజెక్టు అనుమతులు ఇచ్చింది కేం ద్ర ప్రభుత్వం కాదా అని ప్రశ్నించా రు. కాళేశ్వరం నివేదిక పూర్తి పాఠం బయటకొచ్చిన తర్వాత కాంగ్రెస్ సంగతి చూస్తామని హెచ్చరించారు. స్థానిక‌ సంస్థల ఎన్నికల కోసమే సీ ఎం రేవంత్‌రెడ్డి హడావుడి చేస్తు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ రావు మంగళ వారం తెలంగాణ భవన్‌లో సమగ్రం గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇ చ్చారు. కాళేశ్వరం కమిషన్ ని వేదికపై పూర్తి ఆధారాలతో హరీష్‌రావు వివరించే ప్రయత్నం చేశా రు. హరీ ష్‌రావు ప్రెజెంటేషన్ చూసేలా బీఆర్ ఎస్ నేతలు జిల్లాల్లో సైతం ఏర్పా ట్లు చేశారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మీడియాతో మాట్లాడారు. కా ళేశ్వరం కమిషన్ నివేదిక పూర్తిగా ట్రాష్ అని విమ ర్శలు గుప్పించారు.

ముఖ్యమంత్రి బాధ్యతను మాత్ర మే కేసీఆర్ నిర్వర్తించారని రాజకీ య జోక్యం ఎలా అవుతోందని ప్రశ్న ల వర్షం కురిపించారు. కేసీఆర్‌ను హింసించాలనే ధోరణి తప్పా సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజా సమస్యలు పట్ట డం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే శారు. దేశంలో చాలా కమిషన్లు న్యాయస్థానాల ముందు నిలబడలే దని చెప్పుకొచ్చారు. గతంలో చంద్ర బాబుపై కూడా కమిషన్లు వేశారని, అవి నిలబడలేదన్న విషయం గమ నించాలని సూచించారు. సర్ ఆర్థర్ కాటన్ మాదిరిగా కేసీఆర్ కూడా తె లంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపో తారని పునరుద్ఘాటించారు. తెలం గాణలో కమీషన్ల ప్రభుత్వం నడు స్తోందని ఆక్షేపించారు. 650పేజీల రిపోర్ట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండా డుతామని హెచ్చరించారు.

 

కాళేశ్వరం నివేదికలో నచ్చిన పేరా లను లీక్ చేశారని, నచ్చని నాయ కులను ప్రజల్లో చులకన చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమె త్తారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కేంద్రాన్ని తప్పుపట్టినట్లుందని వి మర్శించారు. కాళేశ్వరానికి అను మతులు ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వ మని గుర్తుచేశారు. కాళేశ్వరం పూర్తి రిపోర్ట్ బయటకు వచ్చాక కాంగ్రెస్ సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చా రు. స్థానిక‌ సంస్థల ఎన్నికల కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హడావుడి చేస్తు న్నారని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక కుట్రతో జరిగిన వ్యవహారమని ఆరోపించారు. పో లవరం మూడుసార్లు కూలినా ఎ న్డీఎస్‌ఏ ఎందుకు రాలేదని ప్రశ్నిం చారు. మేడిగడ్డకు మాత్రం ఎన్డీఎస్‌ ఏ మూడు సార్లు వచ్చిందని ఫైర్ అ య్యారు. ఇది కాంగ్రెస్, బీజేపీ కుటి ల రాజకీయమని మండిపడ్డారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ డిజైన్ చేసిన కాంగ్రెస్‌పైనే మెదట చర్యలు తీసుకోవాలని కోరారు.

కాళేశ్వానికి కేంద్రం ఇచ్చిన అనుమ తులు చూపిస్తే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తల ఎ క్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా కడిగేస్తామని హె చ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ద మ్ముంటే, మైక్ కట్ చేసి పారిపోకూ డదని సవాల్ విసిరారు. కాళేశ్వేరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయడం కో సం ముఖ్యమంత్రి రివ్యూ చేయకుం డా ఎలా ఉంటారని, కేసీఆర్ కూడా అదే చేశారని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని కూడా కేసీఆర్ సొంత నిర్ణయంగా రేవంత్ ప్రభుత్వం ఎలా చెబుతోందని నిలదీశారు. సీడబ్ల్యూ సీ అనుమతి, కేబినెట్ నిర్ణయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిం దని స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సంస్థ కూడా మేడి గడ్డ వద్ద ప్రాజెక్ట్ కట్టవచ్చని చెప్పిం దని మాజీ మంత్రి హరీష్‌రావు గు ర్తుచేశారు.

 

కాంగ్రెస్ కుట్రలను హరీష్ రావు ఎండగట్టారు

నల్లగొండ జిల్లా బి ఆర్ఎస్ అధ్య క్షుడు రవీంద్రకుమార్

నల్లగొండ బిఆరెస్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు రవీంద్ర కుమా ర్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మె ల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసు కుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగ త్, రాష్ట్ర నేతలు కంచర్ల కృష్ణారెడ్డి లు మీడియా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భం గా జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ కాళేశ్వరం పై హరీష్ రావు ప వర్ పాయింట్ ప్రజెంషన్ లో చాలా స్పష్టంగా కాంగ్రె స్ కుట్రలను ఎండగట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కెసిఆర్, హరీష్ రావులపై పెద్ద ఎత్తు న కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తాను జైలు జీవితం గడిపాడు కాబట్టి ఎదో ఒక కారణం పేరుతో జైల్లో వే యాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నాడని గుర్తు చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కు మ్మక్కుయిన రేవంత్ రెడ్డి డైవ ర్శన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధి కారo లోకి వచ్చిన నాటి నుంచి రకరకాల కమిషన్లు వేశారని,కానీ ఇప్పటికీ ఏ దీ తెల్చలేకపోయారని ఎద్దేవా చేశారు.కాళేశ్వరం పేరు తో కమిషన్ అని వేశారని, కానీ సాధించిన తెలం గాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దెందుకు కెసిఆర్ ప్రాజెక్టులు చేపట్టారన్నారు.

అన్ని అనుమతులతో గోదావరి పై బ్యారేజ్ లు నిర్మాణం చేశారని చె ప్పారు. అతి తక్కువ ఖర్చుతో కాళే శ్వరం పూర్తి చేసారని, లక్షలాది ఎ కరాలకు సాగునీళ్లు ఇచ్చారని, సూ ర్యాపేట వరకు సాగు నీరు పారిం చారని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి రాష్ట్రా నికి రెందేళ్లల్లో ఇప్పటికి చేసిందేమీ లేదని విమర్శించారు.గత ప్రభుత్వ పథకాలపై కమిషన్లు, విచారణల పేరుతో ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని, ఇక్కడి నుంచి క మీషన్లు ఢిల్లీకి పంపడంలో మీరు బిజీ అయ్యారoటూ ఎద్దేవా చేశా రు. కాళేశ్వరంపై నిన్న కమిషన్ రి పోర్ట్ కూడా పూర్తిగా ప్రజలను త ప్పుదోవ పట్టించేలా ఉందన్నారు.