–మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు
Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: రైతు రుణమాఫీ (Farmer loan waiver) మార్గదర్శకాలు చూస్తే రేవంత్ (revanth)ప్రభుత్వం రైతులను మాయ చేస్తున్నట్లే ఉందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు (Harish Rao)ధ్వజ మెత్తారు. వడ పోతల, రైతుల సంఖ్య కోత మీద దృష్టి పెట్టినట్లు కనిపిస్తోందని అన్నారు. రుణమాఫీకి రేషన్ కార్డు ల షరతులు ఎందుకని ప్రశ్నిం చారు. చేతల పాలన పోయి షర తుల పాలన వచ్చిందని విమర్శిం చారు. బ్యాంక్‌లు రేషన్ కార్డులు చూసి రుణం ఇచ్చారా అని నిల దీశారు. రైతును రైతుగా చూడాలని సూచించారు. రైతు రుణమాఫీకి(Farmer loan waiver) ఇన్ని షరతులు ఎందుకని ప్రశ్నిం చారు. రేషన్ కార్డులో విడిపోయి నంత మాత్రాన రుణమాఫీకి అర్హు లు కారా అని నిలదీశారు.
ఇది రైతులను (farmers)మోసం చేయడమేనని విమర్శించారు. ఏడు నెలలుగా కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వట్లేదని అడిగారు.కుటుంబం, రేషన్ కార్డు (Family, ration card)అనే షరతులు ఎత్తేయాలని అన్నా రు. పీఎం కిసాన్ నిబంధన తీసుకోవ డం అంటే 39లక్షల మంది రైతుల రుణమాఫీ ఎగ్గొట్ట డమేనని చెప్పారు. రూ.2లక్షల రూపాయలు నేరుగా రైతుల ఖాతా లో జమ చేయాలని అన్నారు. రైతు రుణమాఫీని ఆలస్యం చేసే ప్రయ త్నం చేస్తోందని మండిపడ్డారు. స్వల్ప కాలిక రుణాలకే వర్తిస్తుందని అంటూ పండ్ల తోటలు పెట్టిన రైతులకు ఎగ్గొడుతున్నారని మండిప డ్డారు. రీ షెడ్యూల్ రైతులకు వర్తిం చదంటే రైతులు నష్టపోతారని చెప్పా రు. షరతులు ఉపసంహ రించుకోవాలని లేదంటే రైతుల పక్షాన పోరాడుతామని తెలిపారు. అసెంబ్లీలో రైతు రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు.