–ఇరాన్ జనరల్ అబ్బాస్ సైతం
–బీరుట్‌లో ఓ బంకర్‌లో సమావే శం
–గుర్తించి దాడులు చేసిన ఇజ్రా యెల్
–ముప్పై రెండేళ్లుగా హిజ్బుల్లా చీఫ్‌గా నస్రల్లా
— 720కి చేరిన మరణాలు, రహ స్య ప్రదేశానికి ఇరాన్ సుప్రీం లీడర్
Hassan Nasrallah: ప్రజా దీవెన, బీరుట్: ఇరాన్ మద్దతుతో లెబనాన్ భూభాగం పైనుంచి ఇజ్రాయెల్‌పై భీకర క్షిపణి దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్ర సంస్థకు పెద్ద దెబ్బ తగిలింది. శుక్ర వారం రాత్రి దక్షిణ బీరుట్‌లోని దహియాపై ఇజ్రాయెల్ (Israel) డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) (IDF) వైమానిక దళం చేసిన క్షిపణి దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతిచెందా రు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ అబ్బాస్ నిల్ఫోరుషన్ కూడా ఈ దాడిలో దుర్మరణంపా లయ్యారు. వీరిద్దరితోపాటు హిజ్బు ల్లాకు చెందిన ఒక కమాండర్ అలీ కర్కీ, ఇద్దరు డిప్యూటీ కమాండర్లు, నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా (Hassan Nasrallah)కూ డా మృతిచెందినట్లు ఐడీఎఫ్ శని వారం ఉదయం ప్రకటించింది. మధ్యాహ్నానికిహిజ్బుల్లా వర్గాలు కూడా హసన్ నస్రల్లా మృతిని ధ్రు వీకరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశాయి. జెరూసలేం వైపు వెళ్లే క్ర మంలో జరుగుతున్న పోరాటంలో నస్రల్లా అమరుడయ్యారని పేర్కొ న్నాయి. ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఆ ప్రకటనలో స్పష్టం చేశాయి. నస్రల్లా ఉనికిని గుర్తించిన ఐడీఎఫ్ పక్కా వ్యూ హంతో ‘ఆపరేషన్ న్యూ ఆర్డర్’ పేరుతో భీకర దాడులు జరిపింది. దహియాలోని ఓ ఇంటి కింద ఉన్న బంకర్‌లో నస్రల్లా ఉన్నట్లు గుర్తించి, అంతమొందించింది. ‘‘నస్రల్లా ఇకపై ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయ భ్రాంతులకు గురి చేయలేడని ప్రక టించింది.
పేజర్ బాంబులు, వాకీ టాకీ పేలుళ్ల (Pager bombs, walkie talkie explosions)తర్వాత లెబనాన్‌పై వైమానిక దాడులను ముమ్మరం చేసిన ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా ఒక్కొక్కరుగా హిజ్బుల్లా కీలక నేత లను అంతమొందిస్తూ వచ్చింది. బుధవారం హిజ్బుల్లా క్షిపణి విభా గం కమాండర్ మహమ్మద్ అలీ ఇస్మాయిల్ అడ్డు తొలగించింది. గురువారం వైమానిక దళ కమాం డర్ మహమ్మద్ హుస్సేన్ సోరౌర్ ను హతమార్చింది. శనివారం సా యంత్రం కొనసాగించిన దాడుల్లో హిజ్బుల్లా ఇంటెలిజెన్స్ (Hezbollah Intelligence)విభాగం సీనియర్ నేత హసన్ ఖలీల్ యా సిన్ మృతిచెందినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఇదిలా ఉండగా నస్రల్లా 1960లో బీరుట్ శివారు లోని బుర్జ్ హమ్ముద్‌లో ఓ చిరు కూరగాయల వ్యాపారి ఇంట్లో తొమ్మిది మంది తోబుట్టువుల్లో ఒకరిగా నస్రల్లా జన్మించారు. 16 ఏళ్ల వయసులో షియా పొలిటికల్, పారామిలిటరీ గ్రూప్ ఉద్యమం ‘అమల్’లో చేరారు. అప్పుడే ఆయన పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్(పీఎల్‌వో) నేత అబ్బాస్ అల్ ముసావి దృష్టిలోపడ్డారు. 1980లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసి, బీరుట్ నుంచి పీఎల్‌వోను తరిమికొట్టింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ వ్యతిరేక ఉద్యమాల్లో నస్రల్లా కీలకంగా వ్యవహరించారు. 1982లో హిజ్బుల్లా ఏర్పాటులో నస్రల్లాది కీలక పాత్ర. 1992లో అప్పటి హిజ్బుల్లా అధినేత అబ్బాస్ అల్ ముసావిని ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. దీంతో సంస్థ పగ్గాలను నస్రల్లా అందుకున్నారు. అప్పటికి అతడి వయసు 32 సంవత్సరాలు. 2006లో లెబనాన్‌లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్‌ను ఓడించడంలో ఆయన కీలక ప్రాత పోషించారు. అప్పటి నుంచే ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువుగా మారారు. హిజ్బుల్లా ప్రభావాన్ని దేశ సరిహద్దులు దాటించి.. 2011లో సిరియా అంతర్యుద్ధంలోనూ పాల్గొనేలా చేశారు. కాగా.. 1997లో ఇజ్రాయెల్ సైనికులతో జరిగిన పోరాటంలో నస్రల్లా తన పెద్ద కుమారుడు హదీని కోల్పోయారు. తాజాగా బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో కుమార్తె జైనబ్ ప్రాణా లను పోగొట్టుకున్నారు.
అండర్ గ్రౌండ్ కు ఖమేనీ
నస్రల్లా మరణం.. ఇజ్రాయెల్ (Israel)సైన్యం దూకుడు నేపథ్యంలో ఇరా న్ అప్రమత్తమైంది. నస్రల్లాతో పాటు తమ సైన్యానికి చెందిన జనరల్ కూడా మరణించడంతో ఇజ్రాయెల్‌పై అగ్గిమీద గుగ్గిల మవుతోంది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా ఇరాన్ సుప్రీంలీడర్ అ యతుల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అంత ర్జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేసింది. అయితే అంతకు ముందు ఖమేనీ హిజ్బుల్లా, పశ్చి మాసియాలోని ఇతర మిత్ర పక్షా లతో అత్యవసరంగా భేటీ అయిన ట్లు తెలుస్తోంది. నస్రల్లా మరణం నేపథ్యంలో ఖమేనీ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘లెబనాన్ ప్రజలకు, హిజ్బుల్లాకు అండగా ఉండాలి. దాడులను ఎదుర్కోవ డంలో వారికి సహాయం చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలు పునిచ్చారు. నస్రల్లా మృతితో లెబ నాన్‌కు తమ బలగాలను పంపి, ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనేందుకు ఇరాన్ (iran) సిద్ధమవుతోందని విశ్లేష కులు పేర్కొన్నారు. కాగా నస్రల్లా మృతిని హమాస్, ఇరాక్ కూడా ఖండించాయి. ఇరాక్ ఏకంగా మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది.