HCU Land : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: హైదరాబాదు సెంట్రల్ యూనివర్సి టీ భూముల వేలాన్ని ఆపాలని వి ద్యార్థుల మీద, యూనియన్ నా యకుల మీద పోలీసుల నిర్బంధా న్ని తీవ్రంగా ఖండిస్తున్నమని సీపీ ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం అన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుమే రకు బుధవారం సుభాష్ విగ్రహం దగ్గర ప్లే కార్డులు నల్లరిబ్బులతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ400 ఎకరాల యూనివర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయ త్నాలను విరమించాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాలను, వి ద్యా వ్యవస్థను బలోపేతం చేయవ లసిన దశలో రాష్ట్ర ప్రభుత్వం ఇం దుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న దని ఆరోపించారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ప్ర భుత్వం వెనక్కు తీసుకుని అమ్మకా నికి పెట్టింది. విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని అమ్మకానికి పెట్టవద్దని, యూనివర్సిటీ అభివృ ద్ధికే వినియోగించాలని హైదరాబా ద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెం ట్స్ యూనియన్ నాయకత్వంలో గత కొద్ది రోజులుగా విద్యార్థులు పోరాడుతున్నారు. ఉన్నట్టుండి పెద్ద ఎత్తున పోలీసులు హైదరాబా ద్ సెంట్రల్ యూనివర్సిటీ తూర్పు క్యాంపస్‌లోకి బుల్డోజర్లతో ప్రవే శించారు.
ప్రభుత్వం ఎంపిక చేసిన 400 ఎక రాల స్థలం దాటి తూర్పు క్యాంపస్ స్థలంలో కూడా చదును చేయడం మొదలుపెట్టారు. ఇది సరైందికాద ని ప్రశ్నించిన విద్యార్థులను 60 మందిని అమ్మాయిలతో సహా అరె స్టు చేసి రాత్రి 10 గంటల వరకు మాదాపూర్, రాయ్‌దుర్గ్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లల్లో నిర్బంధించారు. పోలీసుల దాడిలో ఒక విద్యార్థి తల పగిలింది. అమ్మాయిల బట్ట లు చింపారు. రక్తాలు కారే విధంగా గీరారు. పైగా మరోసారి ఆందోళన చేయబోమని అంగీకరిస్తూ వీడి యో వాంగ్మూలం ఇవ్వాలని చెప్ప డం అభ్యంతరకరం. అప్రజాస్వా మికం. దీనిని వ్యతిరేకిస్తూ సిపిఎం మంగళవారం యూనివర్సిటీ గేటు దగ్గర ధర్నాకు పిలుపుగా సిపిఎం నాయకుల ఇండ్ల మీదికి అర్ధరాత్రి వచ్చి అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.
ప్రజా పోరాటాలను గౌరవిస్తామని ప్రజాస్వామ్య పునరుద్ధరణ తన ఏడవ గ్యారెంటీగా ప్రకటించిన కాం గ్రెస్ ప్రభుత్వం ఇంత అప్రజా స్వా మికంగా వ్యవహరించ డాన్ని ఖం డిస్తున్నా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల పట్టణ కేంద్రాల్లో జరుగు తున్న నిరసన కార్యక్రమాల్లో భా గంగా నల్లగొండలో చేయడం జరి గిందని అన్నారు. ప్రభుత్వం వెం టనే 400 ఎకరాల భూమి అమ్మకం ప్రయత్నా లను విరమించాలని, విద్యార్థుల మీద కేసులు ఉప సంహరించి అ క్రమంగా అరెస్టు చేసిన విద్యార్థు ల ను తక్షణం విడు దల చేయాలని అక్రమ కేసులు ఎత్తివే యాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయ ణ, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయ ల నర్సిరెడ్డి, కొండ అనురాధ, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, పట్టణ, మం డల కమిటీ సభ్యులు కోట్ల అశోక్ రెడ్డి, పోలే సత్యనారాయణ, గాదె నరసింహ, బొల్లు రవీందర్, ఊ ట్కూరి మధుసూదన్ రెడ్డి, భూతం అరుణ, సలివొజు సైదా చారి, కందుల అశోక్, మాజీ కౌన్సి లర్ అవుట రవీందర్, కడతాల భూపాల్, బాణాల పరిపూర్ణ చారి, ఆంజనేయులు, పల్లె నగేష్ , కునుకుంట్ల ఉమా రాణి ,ఆవుల గిరి, శివ జనార్ధన్ సర్వయ్య తదితరులు పాల్గొ న్నారు.