Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Heavy rains:కొనసాగుతోన్న భారీ వర్షాలు

–బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ముసురు
–ఏపీ, ఒడిశా మధ్య నిలిచిపోయిన రాకపోకలు
–మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

Heavy rains:ప్రజా దీవెన, హైదరాబాద్:
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో శబరి నదితో పాటు, పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏపీ-ఒడిశా మధ్య ఉన్న 316 జాతీయ రహదారిపై(National Highway) కొన్ని చోట్ల గండ్లు పడ్డాయి.

చింతూరు-కల్లేరు గ్రామాల మధ్య గండ్లు పడడంతో ఏపీ, ఒడిశా మధ్య రాకపోకలు ఆగిపోయాయి. ఇక రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తా యని ఇప్ప‌టికే ఐఎండీ ప్రకటిం చింది. భారీ నేపథ్యంలో, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత అధికారులను అప్రమత్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లోనూ క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలు ఉపయోగించాలని అచ్చెన్నాయుడు (achen Naidu)అన్నారు. విద్యు త్ సమస్యలు పరిష్కరించేలా సిబ్బం ది ఎప్పుడూ కూడా సిద్దంగా ఉండాలని ఆయన తెలిపారు. వాయు గుండం కొనసాగుతు న్నందున, మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

గోదావరి ఉగ్రరూపం..గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కు గోదావరి ఉధృతంగా పెరిగి ఉగ్రరూపం దాల్చింది గోదావరి భారీగా పెరుగుతూ ములుగు జిల్లాలోని వాజేడు మండలం పేరూరు వద్ద 15. 680 మీటర్లకు చేరడంతో తెలంగాణ చతిస్గడ్ రాష్ట్రాల మధ్య సరిహద్దులోని టేకులగూడెం వద్ద 163 జాతీయ రహదారి నీట మునిగింది

*కడెం ప్రాజెక్టులోకి కొనసాగుతు న్న వరద…* నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు (Narayan Reddy project) ఎగువ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

దీంతో మూడు గేట్లను ఎత్తివేసి 11016 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఈ మేరకు కడెం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాథోడ్ (executive Engineer Rathod) వైటల్ శనివారం రాత్రి 7 గంటలకు ప్రకటించారు.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం రాత్రి 7 గంటల వరకు 690.400 అడుగుల నీరు ప్రాజెక్టులోకి చేరిందని తెలిపారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందన్నారు.ప్రాజెక్టు(project )ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం 15338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందని, ఇన్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతో 3 వరదగేట్లు ఎత్తి 11099 క్యూసెక్కుల నీటిని (water level)విడుదల చేస్తున్నందున గోదావరి పరివాహక ప్రాంతంలోని మత్స్యకారులు, పశువుల కాపరులు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.