–వారికి మీపై నమ్మకం లేదా అని హరియాణా ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న
–రైతుల కోసం శంభు సరిహద్దు తెరవాలన్న హైకోర్టు ఉత్తర్వులపైస్టే
High Court orders:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: రైతుల పంటలకు (Farmers’ crops) ఇచ్చే కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పా టుచేయాలని పంజాబ్, హరి యా ణా ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూ చించింది. పలు సాగు అంశాల పై ఈ రెండు రాష్ట్రాల రైతాంగం పోరా డుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ పొలిమేరల్లోని శంభు సరిహద్దు వద్ద ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి శిబి రాలు వేసుకుని రైతులు (farmers) ఉంటు న్నా రు.
అక్కడి సరిహద్దులను అదే రోజున హరియాణా ప్రభుత్వం మూ సివేసింది. దీనిపై రైతులు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యం లోనే అత్యున్నత న్యాయస్థానం (court of law) స్పం దించింది. అడ్డంగా పెట్టిన బారి కేడ్లను తొలగించి రైతుల కోసం సరిహద్దులను తెరవాలని ఈ నెల 10న పంజాబ్, హరియాణా హైకో ర్టు ఇచ్చిన ఆదేశాలను హరియాణా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశా ల అమలును సుప్రీంకోర్టు ఒక వా రం పాటు నిలుపుదల చేసింది. హరియాణా తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదన లు వినిపించారు.
సరిహద్దులు తెరిచి ఆందోళన చేస్తున్న రైతులను ఢిల్లీలోకి (delhi) అనుమతిస్తే శాంతిభద్రత లు అదుపు తప్పే ప్రమాదం ఉందని, దాదాపు ఐదారు వందల ట్యాంకులు శంభు సరిహద్దుల్లో నిలిపి ఉంచారని, అవి సాయుధీక రించిన ట్యాంకులని తెలిపారు. అయితే, ట్యాంకులు, ట్రాక్టర్లు (Tractors)లేకుండా రైతులు ఢిల్లీకి వెళితే సరిపోతుందా అని కోర్టు ప్రశ్నిం చింది. రైతులకు, ప్రభుత్వానికి మధ్య విశ్వాసం సమస్యగా ఉన్న ట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానిం చింది. రైతుల వద్దకు ప్రభుత్వం వెళితే వాళ్లెందుకు ఢిల్లీ దాకా వస్తా రని ప్రశ్నించింది. ఈ దిశగా ఇప్పటి వరకు రైతులతో సంప్రదింపులు జరిపారా మంత్రులు రైతుల శిబి రాలకు వెళ్లవచ్చు కదా పరస్పరం విశ్వాసాన్ని కల్పించేలా మధ్యవ ర్తులు ఎవరు లేరా అని ఆరా తీసింది.
రాహుల్ ను కలిసిన రైతులు.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా పలు సాగు అంశాలపై ఉద్య మిస్తున్న రైతులు బుధవారం పార్ల మెంటు ఆవరణలో రాహుల్ గాంధీ ని కలిశారు. రైతుల డిమాండ్లకు (demansD) కాంగ్రెస్ పార్టీ తొలినుంచీ మద్దతు ఇస్తోందని వారికి రాహుల్ తెలి పారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాకు చెందిన ప్రతినిధులు తమ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో, రైతుల డిమాండ్లపై ‘ఇండియా’ పార్టీ లతో చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని రాహుల్ (rahul)హామీ ఇచ్చారు.