Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Election Commission : హైకోర్టు కీలక ఆదేశం, ఎన్నికలె ప్పు డో చెప్పాలని ప్రభుత్వం, ఈసీలకు అల్టిమేటo 

Election Commission : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ వాతావరణం కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల తో ఎన్నికల నిర్వహణకు ముందు కు వచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైన విష యం తెలిసిందే. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ వ్యా ప్తoగా కొనసాగుతున్న చర్చోప చ ర్చలు కొట్టకేలకు హైకోర్టు మెట్లెక్కా యి. ఈ క్రమంలో శుక్రవారం తెలం గాణ స్థానిక ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామాలు చోటు చేసుకుం టున్నాయి. పెద్ద కొంతకాలంగా కొన సాగుతూ వస్తున్న పరిణామాలపై తాజాగా హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది.

 

స్థానిక ఎన్నికలపై రీనోటిఫికేషన్‌ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పి టిషన్‌ లో దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ఈసీ నోటిఫికేషన్‌ ను సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ న్యాయవాది సురేందర్‌ పిటిషన్ వే శారు. దీనిపై శుక్రవారం అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో బా గంగా న్యాయస్థానం వాదనలు వి న్నది.ఎన్నికలు ఎప్పుడు నిర్వహి స్తారో చెప్పాలని ప్రభుత్వం, ఎన్ని క ల కమిషన్ ను ప్రశ్నించింది.

 

ఎన్నికలు నిర్వహణపై సమాధానం చెప్పేందుకు రెండు వారాల సమ యం ఇవ్వాలని న్యాయస్థానాన్ని ప్ర భుత్వం, ఈసీ కోరింది. దీంతో హైకో ర్టు ఇందుకు అంగీకరించి రెండు వా రాల సమయం ఇస్తూ నిర్ణయం తీ సుకున్న నేపథ్యంలో తదుపరి వి చారణను రెండు వారాలకు వాయి దా వేసింది.

 

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 జారీ చేసిన విషయం తెలి సిందే. ఈ జీవో ప్రకారమే ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ వి డుదల చేసింది. అయితే హైకోర్టు ఆ జీవోపై స్టే విధించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిం చింది. విచారణ చేపట్టకుండానే అ త్యున్నత న్యాయస్థానం సైతం రా ష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేయ డంతో రిజర్వేషన్ల పంచాయితీ అగ మ్యగోచరంగా మారింది. దీనితో స్థా నిక ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. అటు ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ రాకపోతే పార్టీ ప రం గా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం ప్రక టించిన విషయం విధితమే.

 

ఇదిలా ఉండగా స్థానిక సంస్థల ఎ న్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చె ప్పాలని తెలంగాణ ప్రభుత్వం, ఎ న్నికల కమిషన్ ను హైకోర్టు ప్రశ్నిం చిన నేపథ్యంలో స్థానిక సంస్థలకు సంబంధించి రీ నోటిఫికేషన్ ఇవ్వా లంటూ సురేందర్ అనే న్యాయవా ది కోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. దీనిపై విచారణ జరిపిన న్యా యస్థానం ఎన్నికలు ఎప్పుడు నిర్వ హిస్తారో చెప్పాలని ప్రభుత్వం, ఈసీ లను కోరింది. సుప్రీంకోర్టు కూడా ఎ న్నికలకు వెళ్లాలని సూచించింది క దా అని గుర్తు చేసింది. దీంతో సు ప్రీంకోర్టు చెప్పింది కానీ కోర్టు ఆర్డర్ కాపీలో ఎక్కడా లేదని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు.

 

అధికారిక ఉత్తర్వులు కాకుండా మౌ ఖికంగా మాత్రమే చెప్పారని అధికా రుల తరపున న్యాయవాది వివరిం చారు. నిన్న ప్రభుత్వానికి లేఖ రా శామని, చర్చించిన తర్వాత రీనో టిఫికేషన్ ఉంటుందని తెలిపారు. దీంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహి స్తామో చెప్పేందుకు రెండు వారాల సమయం కావాలని ప్రభుత్వం, ఎ లక్షన్ కమిషన్ కోరగా హైకోర్టు ఇం దుకు అంగీకరించింది. తదుపరి వి చారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే జీవో 9తో బీ సీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వ డాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పి టిషన్లు దాఖలు కాగా స్టే విధించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా న్యాయస్థానాల్లో స్థానిక ఎన్నికల ని ర్వహణపై ఆంక్షలు కొనసాగు తు న్న నేపథ్యంలో ఇప్పటికే సమయం మించిపోయినందున ఎన్నికల ని ర్వహణపై త్వరలోనే అటు కోర్టు ఇ టు ప్రభుత్వం నిర్ణయానికి రావ చ్చ న్న సంకేతాలు వెలుగుతున్నాయి.