Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

HighCourtPetition : గులాబీ బాస్ కు బ‌హిష్క‌ర‌ణ సెగ, హైకోర్టులో పిటిషన్ దాఖలు

HighCourtPetition : ప్రజా దీవెన, హైద‌రాబాద్: తెలంగా ణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి ప లు దఫాలు హాజరు కాకపోవడం పై హైకోర్టులో పిటిషన్ దాఖ లైంది. దీంతో బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ కు శాసనసభ బహిష్కరణ సెగ తగి లే అవకాశం ముందుకు సాగుతోం ది. ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెం దిన విజయ్ పాల్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేసీఆర్ అ సెంబ్లీకి రాకుంటే స్పీకర్ చర్యలు తీసుకునే లా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ సదరు పిటిషన్ లో కోరారు.

అయితే ఇటీవల ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఓ సమా వేశంలో పాల్గొని ప్రసంగి స్తున్న సమ యంలో కెసిఆర్ కు సమాజ బహి ష్కరణ తప్పదని ప్రస్తావించిన అం శం హైకోర్టులో తాజా పిటి షన్ దాఖ లు సందర్భంలో గుర్తు చేసుకోవా ల్సిన అంశంగా పరిశీల కులు భావి స్తున్నారు. కేటీఆర్ దీనిపై స్పందిం చి కేసీఆర్ బదులు వేరే వాళ్ళను అ క్కడ పోటీ చేయించాలని పిటి షన్‌ లో పేర్కొన్నా రు. ప్రతిపక్ష నేత గా కేసీఆర్ అసెంబ్లీలో ప్రజల కోసం పోరాటం చే యాలని కానీ అసెంబ్లీకే రాకుంటే అనర్హుడిగా ప్రకటించాలని పిటి షన్‌లో అప్పిల్ చేశారు.

2023 డిసెంబర్ 16న ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలు చేప ట్టారని, ఆయన ఇప్పటి వరకు అ సెంబ్లీకి రాకున్నా స్పీకర్ కానీ, ఆ యన కార్యాలయం కానీ ఎలాంటి ప్రొసీడింగ్స్ చేపట్టలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపించేందుకు ఎమ్మె ల్యేల జీతాలు కూడా పెంచారని, ప్ర తిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలను నిర్వహించలేకపోతే ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని కోర్టును కోరారు.

శాసన వ్యవస్థ, అధికారులు తీసుకునే రాజకీయ, ఆర్థిక నిర్ణయాల ను సమీక్షించే అధి కారం న్యాయ వ్యవస్థకు ఉందని చెప్పారు. ప్రతి వాదులుగా కేసీఆర్, కేటీఆర్ లతో పాటు స్పీకర్, స్పీకర్ కార్యాలయా న్ని చేర్చారు. ప్రస్తుతం ఈ పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. ఏది ఏమైనా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తాజాగా హైకో ర్టులో ప్రైవేటు పిటిషన్ కెసిఆర్ సెం టర్ పాయింట్ గా కొనసాగుతున్న చర్చోపచర్చలు ఎటు దారి తీస్తాయో అని సర్వత్ర ఆసక్తి నెలకొంది.