Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

HMPV: బ్రేకింగ్ న్యూస్, భారత్ లో చైనా వైరస్ తొలి కేసు నమోదు

HMPV: ప్రజా దీవెన బెంగుళూరు: అంతటా అనుమానాలు వ్యక్తమైనట్లె భారత దేశంలో చైనా వైరస్ ప్రవేశించింది. చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ ఎంపివి భారత్ కు చేరినట్లు తాజా సమాచారం. బెంగళూరులో ఓ 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికా గా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకె ళ్లారు.అక్కడి ల్యాబ్ టెస్టులో బేబీకి హ్యూమన్ మెటాన్యు మోవైరస్ (HMPV) పాజిటివ్ అని తేలింది.

ఈ కేసు గురించి తమకు సమాచారం అందినట్లు కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది.అయితే తమ ల్యాబులో దీన్ని ఇంకా నిర్ధారించా ల్సి ఉందని తెలిపింది.బెంగుళూరు లో 8 నెలల చిన్నారికి వైరస్ నిర్దారణతో అంతా నిర్ఘాంత పోయారు. కాగా అప్రమత్తత లేకుంటే ముప్పు తప్పదని వైద్య నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు.