Home Minister Anita: ప్రజా దీవెన, అనంతపురం:తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చ రించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పే ర్కొన్నారు. అనంతపురంలో జరి గిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరే డ్‌కు మంత్రి ముఖ్య అతిథిగా హాజ రయ్యారు. పరేడ్ ముగిసిన అనం తరం విూడియాతో మాట్లాడారు. వై కాపా నేత, నటుడు పోసాని కృష్ణమురళి గతంలో అత్యంత దారుణంగా మాట్లాడినందుకే కేసు లు నమోదు అయ్యాయి. రాష్ట్రం లో పోసాని మాటలను సమర్థించే వాళ్లు ఒక్కరైనా ఉన్నారా? అంత ర్యుద్ధం గురించి మాట్లాడే గోరంట్ల మాధవ్ తమ పార్టీలో జరుగు తు న్న అంతర్యుద్ధం గురించి ముందు ఆలోచించాలి.
ఇప్పటికైనా నోటిని అదుపులో పెట్టుకోవాలని గోరంట్ల మాధవ్‌ను హెచ్చరిస్తున్నా. నోటికొ చ్చినట్టు మాట్లాడతాం అంటే కుద రదు. ఇక్కడ ఉన్నది వైకాపా ప్రభు త్వం కాదు కూటమి ప్రభుత్వం. ఏది పడితే అది మాట్లాడటం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించే ది లేదు. రెడ్ బుక్ ప్రకారం మేం ముందుకెళ్తే వైకాపా నేతలెవరూ రోడ్లపై తిరగలేరు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయి. కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదు. అలా అని తప్పు చేసిన వాళ్లని ఉపేక్షించేది లేదు. చేసిన తప్పులకు శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు. పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది ఆయనే కదాని అన్నారు.వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై హోంమంత్రి వంగల పూడి అనిత తీవ్రస్థాయిలో మండి పడ్డారు. కూటమిలో అంతర్యుద్ధం లేదని.. వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలని హితవుపలికారు.
నోటికొచ్చినట్టు మాట్లాడతాం అంటే కుదరదని… ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు.. ఎన్డీయే ప్రభుత్వమన్నారు. వాక్ స్వాతంత్యర్ర ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడం కుదరదన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు. రెడ్ బుక్ ప్రకారం తాము ముందుకెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరంటూ వార్నింగ్ ఇచ్చారు. పోసాని కృష్ణ మురళిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయని తెలిపారు. కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదని.. అలా అని తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చేసిన తప్పుకు శిక్ష నుంచి తప్పించుకోలేరని తేల్చిచెప్పారు. పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా…. అనుభవించేది రాజానే అని అన్నారు.
మా కూటమిలో ఎలాంటి అం తరుద్ద్యం లేదు.. వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలి అని చురకలు అంటించింది. నోటికొచ్చినట్టు మాట్లాడతామంటే కుదరదు.. ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు.. ఎన్డీయే ప్రభుత్వం అన్నారు. వాక్ స్వాతంత్యర్ర ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడం కుదరదు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. కక్షపూర్తి రాజకీయాలు చేయడం లేదు? అలా అని తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదన్నారు. చేసిన తప్పుకు శిక్ష నుంచి తప్పించుకోలేరు.. పోలీస్ శాఖలో 900 కోట్లు గత అయిదేళ్లలో బకాయి పెట్టారని.. అవన్నీ తాము తీరుస్తున్నామన్నారు.
ఇంతవరకు ఏపీకీ అప్పా లేదని… గ్రే హౌండ్స్ బెటాలియన్ లేదని చెప్పారు. త్వరలో అప్పాకు భూమి పూజ చేస్తామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. గత వైకాపా ప్రభుత్వం పోలీసులకు రూ.900 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లింది. కూటమి అధికారంలోకి
వచ్చాక దాదాపు రూ.250 కోట్ల బకాయిలు చెల్లించాం. అమరావతిలో ఉందన్న ఒకే ఒక కారణంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం గోడలకే పరిమితం చేసింది. గత ప్రభుత్వ పాపాలను ఒక్కొక్కటిగా సరిచేస్తూ వస్తున్నాం. హోం శాఖలో సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమే. త్వరలోనే నియామకాలు చేపట్టి ఇబ్బందులు లేకుండా చూస్తాం అని మంత్రి అనిత పేర్కొన్నారు.
నేరం జరిగిన వందరోజుల్లోనే శిక్ష అమలు … నేరం జరిగిన వంద రోజుల్లో శిక్ష అమలు చేయడమే లక్ష్యం అని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. శనివారం అనంతపురంలో జరిగిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్‌కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఇండోర్, అవుట్ డోర్ విభాగాల శిక్షణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన ఎస్సైలను మెడల్, సర్టిఫికెట్, చీఫ్ మినిస్టర్ పిస్టల్ తో మంత్రి అనిత సత్కరించారు. సివిల్ విభాగం ఫైరింగ్ లో ప్రతిభ చాటిన ఎస్సైలను సత్కరించారు.
సివిల్ విభాగంలో ప్రతిభ చాటిన విజేతలకు ట్రోఫీ అందజేశారు. ఏపీఎస్పీ విభాగాల్లోని ఇండోర్, అవుట్ డోర్,ఆల్ రౌండ్ ప్రతిభ కనబరచిన ఎస్సైలను అభినందించారు. ప్రజలు, పోలీసుల భాగస్వామ్యంతో లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. ప్రజల భద్రత విషయంలో పోలీసుల పాత్ర వెలకట్టలేనిదని చెప్పారు. 394 మంది ఎస్సైలు శిక్షణ పూర్తి చేసుకోవడం హోంశాఖకు అదనపు బలం అని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. శిక్షణలో పాల్గొని కష్టాలను లెక్కచేయకుండా అత్యుత్తమ ప్రతిభ చాటిన అందరికీ అభినందనలు తెలిపారు. ’ విూ కుటుంబ సభ్యురాలిగా విూరు సాధించిన విజయంపట్ల గర్విస్తున్నా ’ అని చెప్పారు. పోలీస్ శాఖలో ప్రజలకు సేవ చేస్తున్న ప్రతి పోలీస్ తన తోబుట్టువుతో సమానం అని అన్నారు.
ఆర్మీ, పోలీస్ విభాగాలకు పంపే కుటుంబాల త్యాగం అనిర్వచనీయమని తెలిపారు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణే ధ్యేయంగా అహర్నిశలు శ్రమించే పోలీసులందరికీ మంత్రి అభినందనలు తెలిపారు. ఖాకీ చొక్కా వేసుకోవడం గర్వంతో పాటు బాధ్యత అని చెప్పారు. ప్రజలకు కష్టమొస్తే దేవుడి తర్వాత పోలీసుల దగ్గరకు వస్తారని తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని సైబర్ నేరాలను అరికట్టాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారిలో 97మంది మహిళా ఎస్సైలు ఉండడం పట్ల గర్వపడుతున్నా నని అన్నారు. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. దాడి, వేధింపులు జరిగిన వంద రోజుల్లో శిక్షపడే వ్యవస్థను తీసుకువస్తామని వెల్లడిరచారు.
గంజాయి, డ్రగ్స్ రహిత ఆంధప్రదేశ్ ను నెలకొల్పుతామని మంత్రి అనిత అన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో లక్ష కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. ఏఓబీ సరిహద్దుల్లోని వేల ఎకరాల గంజాయి సాగును ప్రక్షాళన చేశామన్నారు. పోలీసుల సంక్షేమంపై ప్రత్యేకంగా ప్రభుత్వం శ్రద్ధ పెడుతుందన్నారు. లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామని వెల్లడిరచారు. ప్రతి పోలీస్ స్టేషన్ కి 2 డ్రోన్లు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.