Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nallabandagudem Horror Fear : నల్లబండగూడెంలో నరకయాతన, క్షణంక్షణం జంకుతోన్న జనాలు 

–మిడ్ వేస్ట్ గ్రానైట్ క్వారీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

–ఫ్యాక్టరీ సమీప గ్రామాల్లో గృహా లకు పగుళ్లు

–క్వారీ విస్తరణకు అనుమతులొద్ద ని కలెక్టర్ కు అప్పీల్

–ప్రజా అభిప్రాయ సేకరణలో అస లు ప్రజలేరంటూ ఆగ్రహావేశాలు

–అనుకూలమైన వ్యక్తులతో తూ తూ మంత్రంగా ప్రజాభిప్రాయ సేకర ణ

Nallabandagudem Horror Fear : ప్రజా దీవెన, కోదాడ: కోట్లకు అధిప తులు అయినా వారి ధనదాహం తీరడం లేదు. ప్రకృతి సృష్టించిన స హజ సౌందర్యాలను, భూగర్భ సం పదను విధ్వంసం చేస్తూ పర్యావర ణాన్ని దెబ్బతీస్తూ అక్కడి నివసిం చే ప్రజల ప్రాణాలకు, ఆలుసంగా చేసుకుని బతుకుతున్న వన్య ప్రా ణులకు ముప్పు తలపెడుతూ భవి ష్యత్ లో మహా ప్రళయానికి కారకు లవుతున్నారు. ఇప్పటికే సహజ వ నరులను దోచేసి ఇనుప పెట్టెలను నింపుకునే పనిలో పడ్డారు. పూర్తి వి వరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామ పరిధిలోని మిడి వేస్ట్ గ్రానైట్ నిర్వహకులు క్వారీ ఏర్పాటు చేసి కోదాడ మండల పరిధిలోని నల్ల బండగూడెం మంగలి తండా గ్రామ స్తుల ప్రాణాలతో చెలగాటం ఆడు తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి.

క్వారీ పేలుళ్లు ధాటికి వారి ప్రాణాల తో పాటు ఆస్తులు పోయే ప్రమాద ముంది.క్వారీలలో రాళ్లను పేల్చడం వల్ల కలిగే శబ్దాలు చుట్టుపక్కల ప్ర జలకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నా యని, ముఖ్యంగా రాత్రివేళల్లో నిద్ర కు ఆటంకం కలిగిస్తున్నాయి. క్వారీ లలో జరిగే కార్యకలాపాల వల్ల వె లువడే ధూళి చుట్టుపక్కల ప్రాం తాలకు వ్యాపించి, ప్రజల ఆరోగ్యం పై, పంటలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.భూమి కంపించడం వల్ల ఇళ్లు దెబ్బతింటునాయి, బీట లు వారుతాయి. అనీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

క్వారీలలో ఉపయోగించే రసాయ నాలు నీటిలో కలిసి, నీటిని కలుషి తం చేస్తాయి, తద్వారా తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతుంది అని వాపో తున్నారు. హైదరాబాద్ విజయవా డ జాతీయ రహదారికి అనుకుని క్వారీ ఉండడంతో క్వారీలకు సం బంధించిన వాహనాల రాకపోకల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకా శం ఉంది, ప్రజల ప్రాణాలకు ము ప్పు వాటిల్లుతుంది అన్నారు. ధూ ళి, కాలుష్యం కారణంగా ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, చర్మ సంబంధిత వ్యాధులుతో బా ధపడుతున్నారు.

క్వారీల లో నీటిని ఎక్కువగా ఉప యోగించడం వల్ల, భూగర్భ జలా లు అడుగంటిపోతాయి అని పేర్కొ న్నారు.గ్రానైట్ వేస్టేజీతో గత ఏడాది కోతకు గురైన క్వారీలో వేస్టేజ్ రాళ్ల ను డంపు చేయడం వలన క్వారీ వెనక వైపున పెద్ద గుట్టగా ఏర్పడి. పాలేరు వాగు నుండి వచ్చే వరద నీరు వెడల్పుగా ప్రవహించేందుకు వీలు లేకుండా ఏర్పడింది.గత ఏడా ది సెప్టెంబర్ లో కురిసిన భారీ వర్షా లకు కురిసిన వర్షపు నీరు ప్రవహిం చేందుకు వీలు లేకపోవడంతో ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతం వద్ద జాతీయ రహదారి కోతకు గురి అ యింది. అంతేకాకుండా వందల ఎక రాలలో పంట నష్టం వాటిల్లింది. గ తంలో రైతులు పలువురు జర్నలి స్టులు క్వారీ నిర్వాహకులను ఇలా ఎలా డప్పు చేస్తారని ప్రశ్నిస్తే మా పరిధిలోనే మా భూములనే చేసు కున్నామని సమాధానమిచ్చారు.

ఈ ఏడాది ఆ డంపింగ్ అంతకంత కు పెరిగిందే కానీ అక్కడ నుంచి డం పింగ్ లు తొలగించలేదు. ప్రస్తుతం తిరిగి మరల భారీ వర్షాలు కురుస్తు న్న నేపథ్యంలో మళ్లీ తీవ్ర వరదలు వస్తే జాతీయ రహదారి మళ్లీ కోత కు గురవుతుందని, పంటలు నష్ట పోతామని స్థానికులు ఆరోపిస్తు న్నారు.ప్రజాభిప్రాయ సేకరణ పై పెదవి విరుస్తున్న ప్రజలు కొన్ని ఏం డ్లుగా ప్రకృతిని విధ్వంసం చేస్తూ కో ట్లు గడిస్తున్న మిడ్ వేస్ట్ గ్రానైట్ వా రు తమ సామ్రాజ్యాన్ని మరింత వి స్తృతం చేసుకునేందుకు విస్తరణ పేరుతో ప్రజాభిప్రాయ సేకరణ కార్య క్రమాన్ని మంగళవారం క్వారీలో ఏ ర్పాటు చేశారు. ప్రజాభిప్రాయ సేక రణ కార్యక్రమానికి సూర్యాపేట జి ల్లా అదనపు కలెక్టర్ రాంబాబు ఆ ధ్వర్యంలో నడిచింది.

ప్రజాభిప్రాయ సేకరణ ఉందని చు ట్టుపక్కల గ్రామాలలోని నల్లబం డగూడెం మంగలి తండా గ్రామస్తు లకు నేరుగా సమాచారం ఇవ్వకుం డా కేవలం వారికి అనుకూలమైన వ్యక్తులకు మాత్రమే సమాచారం ఇచ్చి క్వారికి అనుకూలంగా విస్తర ణ కోసం చెప్పించుకున్నారని ఆరో పిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటే గ్రామాలలో చాటింపు వేయిం చి ప్రజలకు నేరుగా సమాచారం ఇ వ్వాలి కానీ కొంతమంది నాయకుల కు మాత్రమే సమాచారం ఇవ్వడం ఏమిటనీ వారు ప్రశ్నించారు. గతం లో క్వారీ ఏర్పాటు సమయంలో మీకు ఉద్యోగ అవకాశాలు కల్పి స్తాం, మీ గ్రామాలను అభివృద్ధి చేస్తామని నమ్మించి మమ్మల్ని నట్టేట ముంచారని ఇప్పుడు అభివృద్ధి మాట దేవుడెరుగు బ్లా స్టింగ్ దాటికి ప్రతిరోజు రాత్రి బిట్టు బిక్కుమంటూ కాలం వెళ్ళ దిస్తు న్నామన్నారు.

జాతీయ రహదారీకి అనుకొని ఉన్న మా రహదారుల అద్వానంగా ఉ న్నాయని ఈ క్వారీ పుణ్యాన రహ దారులు కూడా మాకు సరిగ్గా లే వంటూ తెలిపారు. మా నీరు కలు షితం అవతుంది మా పంట పొలా లు దెబ్బతింటున్నయి మేము రోగా ల బారిన పడుతున్నామంటూ అధి కారులకు విన్నవించుకున్న మాకు మాత్రం న్యాయం జరగడ లేదన్నా రు. బుధవారం నిర్వహించిన ప్రజా భిప్రాయ సేకరణ కార్యక్రమంను జి ల్లా కలెక్టర్ పరిగణంలోకి తీసుకో కుండా నేరుగా కలెక్టర్ క్వారీ వద్దకు వచ్చి గ్రామస్తుల తోటి తిరిగి మర లా ప్రజాభిప్రాయ కార్యక్రమం చేప ట్టాలని వారు కోరుకుంటున్నారు.

ఇదిలా ఉండగా మంగళవారం జ రిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్ర మంలో అధికారుల ముందు కొంత మంది గ్రామస్తులు, సిపిఎం బిజెపి పార్టీ వాళ్లు లేవనెత్తిన ప్రశ్నలను క ప్పిపుచ్చుకునేందుకు కొంతమందికి గ్రానైట్ నిర్వాహకులు ముడుపులు చెల్లించినట్లుగా సమాచారం

బాంబు బ్లాస్ట్ తో భయం భయం : కనక లింగయ్య, మంగలి తండా

 

రైతు మిడ్ వేస్ట్ క్వారీలో బాంబ్ బ్లాస్ట్ లు బాగా జరుగుతున్నాయి. దీంతో వ్యవసాయ బావులన్నీ బూ డుతున్నాయి. బావిలో నీళ్ళని ఇంకిపోతున్నాయి. పంట పొలాల కు భారీ నష్టం జరుగుతున్న సంబం ధిత అధికారులు పట్టించుకోవడం లేదని రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం భారీ బాంబ్ బ్లాస్ట్ కు పొలంలో కలుపుతీస్తున్న మహి ళలపై గ్రానైట్ రాయి కొద్దిపాటి దూ రములో పడ్డది. ఇది రెండోసారి కా వడంతో పొలంలో పనిచేయడానికి కూలీలు సైతం రావడంలేదని రైతు అన్నారు.