Horse riding:ప్రజా దీవెన, కర్నూలు: సరదా కోసం అలవాటు లేని గుర్రపు స్వారీ (Horse riding) చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకు న్నాడు ఓ యువకుడు. భార్య పిల్లలు (wife children)ఉన్న వ్యక్తి బాధ్యతా రహితంగా ఇష్టానుసారంగా గుర్రం స్వారీ చేశారు. గుర్రం స్వారీ లో (Horse riding) ఎలాంటి మెలుకవలు తెలియని అతడు ప్రాణాల మీదకు తెచ్చుకు న్నాడు. సరదాగ చేసిన పని ప్రాణాలను తీసి కుటుంబాన్ని రోడ్డున పడేసింది. గుర్రపు స్వారీ చేస్తూ గుర్రాన్ని ఇబ్బంది పెడుతూ కొనసాగుతున్న తరుణంలో ఒక్క సారిగా కింద పడి వ్యక్తి మృతి చెం దిన ఘటన కర్నూలు జిల్లాలో జరి గింది. మద్దికేరకు (Maddikera) చెందిన పృథ్వీ రాజ్ రాయుడు(28) బీఎన్ పేట నుంచి గుర్రంపై వస్తున్నాడు. మా ర్గమధ్యలో ఒక్కసారిగా అదుపు తప్పి కిందపడటంతో తీవ్ర గాయాల య్యాయి. దీంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొం దుతూ మృతి చెందాడు. పృథ్వీరా జ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గుర్రంపై నుండి పడి యువకుడు మృతి
కర్నూలు – మద్దికేర మండలంలో గుర్రపు స్వారీ చేస్తూ కిందపడ్డ పృథ్విరాజ్ అనే యువకుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి. pic.twitter.com/blN3li9NTA
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2024