Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nagam Varshith Reddy BJP : ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను క్యాంప్ ఆఫీస్ గా ఎలా మారుస్తారు

**నాగం వర్షిత్ రెడ్డి బిజేపీ జిల్లా అద్యక్షులు**

Nagam Varshith Reddy BJP : ప్రజాదీవెన,నల్గొండ టౌన్: దశాబ్దాలుగా పట్టణం నడి బొడ్డులో ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన క్యాంప్ ఆఫీసుగా ఎలా మారుస్తారని బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మంత్రిపై మండిపడ్డారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు మంత్రులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు,అధికారులు వచ్చినప్పుడు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునేవారని అలాంటి గెస్ట్ హౌస్ ను క్యాంపు ఆఫీసుగా మార్చడం వల్ల నల్లగొండకు వచ్చే అతిధులు ప్రజలను ఎక్కడ కలుస్తారని ప్రశ్నించారు. క్యాంప్ ఆఫీస్ ప్రారంభ కార్యక్రమాన్ని బిజెపి పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగం అక్రమ అరెస్టు చేసి వివిధ మండల పోలీస్ స్టేషన్ లకు తిప్పారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి నేటికీ ఒక హామీ కూడా నెరవేర్చలేదని మంత్రికి ప్రజా సమస్యల పట్టవని అన్నారు.డ్రామా బ్రదర్స్ ప్రజాదరణ కోల్పోయారని తమకు సహకరిస్తే ఒక రకంగా సహకరించకపోతే ఒక రకంగా మాట్లాడడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఆది నుండి అలవాటేనని అన్నారు.

 

మంత్రి గా పనిచేస్తున్న కోమటిరెడ్డి ఇప్పటివరకు ఒక్క రాత్రి కూడా నియోజకవర్గ కేంద్రంలో బస చేయలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.మంత్రి హోదాలో నల్లగొండ నియోజకవర్గం న్ని అభివృద్ధిని మరిచిపోయి వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు.నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధిపై దమ్ము ధైర్యం ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిజెపి నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.మంత్రి హోదాలో జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టును కోమటిరెడ్డి పూర్తి చేయించలేకపోయారన్నారు. ఆయనకు రైతుల గోస పట్టడం లేదని కోమటిరెడ్డి కి రైతుల గోస తప్పక తగులుతుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేటికీ అమలు చేయలేదన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి గడప గడపకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని ప్రజలు తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారని త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు గెలవడం ఖాయం అని తెలిపారు.ఈ విలేకరుల సమావేశంలో బిజెపి నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, ,వీరెల్లి చంద్రశేఖర్,పిల్లి రామరాజు యాదవ్, బండారు ప్రసాద్,పాలకూరీ రవిగౌడ్, పోతేపాక లింగస్వామి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.