–భార్య భర్తల మృత్యువాత, కుమా రుని పరిస్థితి విషమం
Huge explosion: ప్రజా దీవెన, చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ప్రమాదాలు జరుగు తూనే ఉన్నాయి. అచ్యుతాపురం లోని ఫార్మా కంపెనీ ప్రమాద ఘటన మరువక ముందే మరో కంపెనీలు ప్రమాదం (accident)జరిగిన విషయం తెలి సిందే కాగా ఇప్పుడు చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలంలో బాణాసంచా తయారీ కేంద్రంలో (Fireworks Manufacturing Centre) పేలుడు సంభవించింది. ఈ ఘట నలో భార్య, భర్తలు ఇద్దరూ మృతి చెందారు. తీవ్రగాయాలపాలైన కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో బాణాసంచా తయారీ కేంద్రం యజమాని ఖాదర్ భాషాతో (khadar basha) పాటు ఆయన భార్య షాహినా ప్రాణాలు విడిచారు. మరో వైపు బాణాసంచా అమ్మకాల లైసె న్స్ తో ఏకంగా బాణాసంచా తయా రు కేంద్రం నడుపుతున్నట్టుగా గుర్తించారు పోలీసులు. ఇక, పేలు డుకు గల కారణాలపై ఆరా తీస్తు న్నారు అధికారులు, తయారీ కోసం తెప్పించుకున్న నల్లమందే పేలుడికి కారణమా అనే అనుమాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.