Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hybrid Rocket: రిటర్న్ రాకెట్ ప్రయోగం సక్సెస్

–చిన్న చిన్న ఉప‌గ్ర‌హాల‌ను క‌క్ష్య‌లోకి ప్ర‌వేశం
–పారాచూట్ల స‌హాయంతో రాకెట్ శ‌క‌లాలు తిరిగి భూమికి
–తొలిసారి చేసిన ప్ర‌యోగం గ్రాండ్ స‌క్సెస్

Hybrid Rocket:ప్రజా దీవెన, చెన్నై: దేశంలో తొలి సారిగా పునర్వినియోగ హైబ్రిడ్‌ రాకెట్ ప్రయోగం శనివారం నిర్వ‌ హించారు. చెన్నై ఈసీఆర్‌లోని తిరువిడందై తీర గ్రామం నుంచి రూమీ-1 (Rumi-1)పేరుతో నిర్మించిన ఈ చిన్న రాకెట్‌ ఈ ఉదయం నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్‌జోన్‌ ఇండియా రూపొందించిన 80 కిలోల బరు వున్న ఈ రాకెట్‌ను (rocket)హైడ్రాలిక్‌ మొ బైల్‌ కంటైనర్‌ లాంచ్‌పాడ్‌పై నుంచి ప్రయోగించారు. ఇది కిలోకన్నా తక్కువ బరువున్న మూడు క్యూబ్‌ ఉపగ్రహాలు, 50 పికో శాటిలైట్లను మోసుకుని ఉప కక్ష్య పథంలోకి దూసుకెళ్లింది. అనుకున్న విధంగా ఉప‌గ్ర‌హాల‌ను క‌క్ష్య‌లోకి ఈ రాకెట్ ప్ర‌యోగించింది. వాతావరణ పరిస్థి తులు, కాస్మిక్‌ రేడియేషన్, యూవీ రేడియేషన్, గాలి నాణ్యత (Cosmic radiation, UV radiation, air quality) తది తరాల్ని క్యూబ్‌ ఉపగ్రహాలు సేకరిం చనున్నాయి. నింగిలో కంపనస్థా యి, ఓజోన్‌ పొర పరిస్థితిని, ఇతర పర్యావరణ పరిస్థితుల్ని పికో ఉప గ్రహాలు గుర్తించనున్నాయి.

పునర్వినియోగం ఇలా.. కంటైనర్‌ తరహా మొబైల్‌ లాంచ్‌ పాడ్‌ నుంచి ప్రయోగించిన తర్వాత భూఉప కక్ష్యలోకి ఉపగ్రహాలు వెళ్లే లా రాకెట్ (rocket)పైకెళ్లింది. అక్కడికి వెళ్లే లోపు శకలాలు తిరిగి భూమికి చేరే లా రాకెట్‌లోనే పారాచూట్లను ఉం చారు. నిర్ణీత దూరం వరకు వెళ్లాక.. శకలాలు కిందకు జారి, భూమికి కొంత ఎత్తుకు చేరేసరికి పారాచూ ట్లు తెరచుకొని సురక్షితంగా దిగడం దీని సాంకేతికత. సెన్సార్ ల సా యంతో ఆ శకలాల్ని సేకరించి తిరిగి మరో రాకెట్ వినియోగానికి వాడ తారు. తద్వారా ప్రయోగ ఖర్చు బా గా తగ్గుతుందని స్పేస్‌జోన్‌ ఇండి యా సీఈవో ఆనంద్‌ (CEO Anand )మేఘలింగం గతంలో తెలిపారు.