–రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి
Hyderabad State Merging: ప్రజా దీవెన, హైదరాబాద్: భారత దేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం (Hyderabad state merging), విమోచన (Liberation) విషయంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) కీలక పాత్రను పోషించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ (State Planning Commission Vice Chairman) డాక్టర్ జి.చిన్నారెడ్డి (Dr. G. Chinna Reddy) పేర్కొన్నారు. సోమవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడారు. అప్పటి హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) పోషించిన పాత్ర మరువ లేనిదని, ఎలాంటి రక్తపాతం లేకుండా చతురతను ప్రదర్శించి, రాజనీతితో సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలోకి విలీనం చేయించారని గుర్తు చేశారు.
హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలోకి విలీనం చేయించడంలో కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరించిందని తెలిపారు. ఈ ఖ్యాతి అప్పుడు హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు, కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేని బీజేపీ (BJP) సహా ఇతర పార్టీల నాయకులు విమోచన, విలీనం విషయంలో అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. విమోచన విలీనం చరిత్ర తెలియకుండానే బీజేపీ నాయకులు ఇస్టారీతిన మాట్లా డుతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయ్యే నాటికి బీజేపీ పుట్టనే లేదన్న విషయాన్ని ఆ పార్టీ నాయకులు మరిచిపోతున్నారన్నారని విమర్శించారు. విమోచన విలీనం విషయంలో బీజేపీ పాత్ర ఏ మాత్రం లేదని, చరిత్ర ఆధారంగా భవిష్యత్ నిర్మాణం జరుగుతుందని, చరిత్రను ఎవరూ మార్చలేరని కొట్టిపారేశారు.
విమోచన విలీనం చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయడం బీజేపీ నాయకులకు ఏమాత్రం తగదని హితవు పలికారు. భావితరాలకు చారిత్రక వాస్తవాలు (History facts) తెలిపాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల నాయకులకు, ప్రజా ప్రతినిధులకు ఉంటుందని, రాజకీయాల కోసం చరిత్రను విస్మరిస్తే రాజకీయ పార్టీల ఉనికి గానీ బీజేపీ పరువు గానీ బజారుపాలు అవుతుందని హెచ్చరించారు. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం, విమోచన అంశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే కీలకమైన పాత్రను పోషించిందన్న చారిత్రక వాస్తవాన్ని ఎవరు కూడా మరిచిపోవద్దని, ఈ విషయంలో బీజేపీ సహా పలు పార్టీల నాయకులు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదన్నారు.
చారిత్రక నేపథ్యం కథకమీషు ఆయన మాటల్లోనే….
హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విమోచన విలీనం జరిగి నేటికీ 77 సంవత్సరాలు కావస్తుంది. 224 సంవత్సరాల పాటు పాలించిన హైదరాబాద్ నిజాం ప్రభుత్వాన్ని (Nizam’s government) ఒప్పించి భారతదేశంలో విలీనం అయ్యే ఇలా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, ఆనాటి హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కి దక్కుతుంది. భారత దేశంలో 563 రాజరిక పాలనలు ఉండగా అందులో 560 రాజా రికార్డు భారతదేశంలోకి విలీనమయ్యాయి. కానీ హైదరాబాద్, గుజరాత్‌లోని జునాగడ్, జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్రాలు మాత్రం భారత దేశంలోకి విలీనం అయ్యేందుకు ఒప్పుకోలేదు. జునాగడ్ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయగా మెజార్టీ ప్రజలు భారత దేశంలోనే విలీనం అయ్యేందుకు ముగ్గు చూపారు. జమ్ము కాశ్మీర్ రాజు హరి సింగ్ పాకిస్తాన్ (Pakistan) వైపు మొగ్గు చూపారు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ రంగంలోకి దిగి 370 ఆర్టికల్ సహా పలు నజరాణాలు ఇచ్చి భారతదేశంలోకి విలీనం చేయించారు.
అయితే హైదరాబాద్ రాష్ట్రం మాత్రం నిజాం ప్రభుత్వం స్వతంత్రంగా ఉండేందుకు మోగ్గు చూపింది. ఈ విషయంలో పటేల్ రాజనీతిని ప్రయోగించి చాకచాక్యంగా వ్యవహరించి భారతదేశంలోకి హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం అయ్యేలా చేశారు. అంతకుముందు హైదరాబాద్ రాష్ట్ర నిజాం ప్రభుత్వం భారత దేశంలో విలీనాన్ని ఇష్టం లేక యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కేసు వేశారు. 8 దేశాలు నిజాం ప్రభుత్వానికి మద్దతునిగా చైనా రష్యా ఉక్రెయిన్ మూడు దేశాలు మాత్రం భారతదేశానికి మద్దతుగా నిలిచాయి.ఈ దశలో 1948 సెప్టెంబర్ 11 న పాకిస్తాన్ కు చెందిన జిన్నా మృతి చెందడం, 12న నాగపూర్ నుంచి భారత మిలటరీ పోలో యాక్షన్ క్యాటర్ పిల్లర్ పేరిట హైదరాబాదులో పోలీస్ యాక్షన్ నిర్వహించింది. దీంతో తప్పని పరిస్థితిలో నిజాం ప్రభుత్వం భారత దేశ ఆర్మీని ఆహ్వానం ఆహ్వానం పొడుస్తు న్నానని అప్పటి నిజాం ప్రభుత్వ ప్రధానమంత్రి నాయికలిని కిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించడం యునై టెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో దాఖలు చేసిన కేసును ఉపసంహ రించు కుంటున్నట్లు నిజాం ప్రభు త్వం రేడియో ద్వారా ప్రకటించిం ది. అయితే నిజాం మాటలను యు.ఎన్. సెక్యూరిటీ కౌన్సిల్ ఒప్పుకోకుండా కేసును వాయిదా వేసింది. సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎదుట నిజాం ప్రభుత్వం లొంగిపోయింది. విలీల సమయంలో షరతుల మేరకు నిజామును అప్పటి గవర్నర్ గా (రాజ్ ప్రముఖ్ ) నియమించారు. మిలట్రీ జనరల్ చౌదరిని ముఖ్య మంత్రి గా నియమించారు. 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమలులోకి రాగా హైదరాబాద్ లో మొదట నిజాం అమలు చేశా రు.1952 లో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్య మంత్రిగా బూర్గుల రామకృష్ణారావు ఎన్నికయ్యారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (United Nations Security Council) వాయిదా పడిన కేసు 1988 వరకు కొనసాగింది.1969 తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో ఇందిరా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని భావించినా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కేసు పెండింగ్ వల్ల అంతర్జాతీయంగా ఏర్పడిన సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదు. చివరికి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు.
ఇలాంటి కాంగ్రెస్ చరిత్రను, హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం, విమోచన చేసిన కాంగ్రెస్ పార్టీ చారిత్రక గొప్పతనాన్ని ఎవరూ కాదనలేరు అని చిన్నారెడ్డి వివరించారు.