Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

HYDRA Harish Rao: హైడ్రా పేరుతో రాజకీయ హైడ్రామా!

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులే లక్ష్యంగా హైడ్రా దాడులు

–ప్రజలను పధకం ప్రకారం పక్కదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

–కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో చేసిన అప్పు 65 వేల కోట్లు

–రాబోయే ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చేయబోయే అప్పు రూ.4 లక్షల 87 వేల 500 కోట్లు

–విపరీత విష జ్వరాలతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది

–రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి ఏర్పడింది

–తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు

HYDRA Harish Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ (Telangana) వ్యాప్తంగా అక్కడ ఇక్కడ తేడా లేకుండా అంతటా విషజ్వరాలతో ప్రజలు అల్లాడుతుoటే రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేద బూని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు (Hari sh Rao) తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ప్రతి ఇంటిలో ఇద్దరు జ్వ రంతో బాధ పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి విప త్కర పరిస్థితుల్లో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం మాత్రం ప్రజల ను ఏమాత్రం పట్ట నట్లు వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు.

ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ప్రత్యర్థులపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని, తప్ప విష జ్వరాలపై పత్రికల్లో పతాకశీర్షికన వార్తలు వస్తున్నాయని గుర్తు చేశారు.

డెంగ్యూతో మరణించారని రోజు వార్తలు వస్తున్నాయని, పిట్టల్లాగా ప్రజలు రాలిపోతాఉంటే ప్రభుత్వా నికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాతో గజగజలాడుతున్నారని చెప్పారు. ఇక లక్షలాది మంది రైతులు రుణమాఫీ (Farmers loan waiver) కోసం ధర్నాలు చేస్తుoటే ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు ప్రయత్నం చేస్తోందని, హైడ్రా (Hydra) పేరుతో హైడ్రామా (High Drama) నడుపుతోందని, ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని పని చేస్తోందని విమర్శించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) తెలంగాణ ఉద్యమకారుడు ప్రజల పక్షాన నిబద్దతగా పని చేసిన వ్యక్తి అని, కాంగ్రెస్ కండువా కప్పుకోండి, లేకపోతే ఇబ్బంది పెడతామన్నట్లు రేవంత్ తీరు ఉందని ఆరోపించారు.

అక్రమకేసులు పెడతామని, మీ ఆస్తులు కూల్చేస్తామన్న ధోరణితో రేవంత్ ప్రభుత్వం పని చేస్తోందని,పటాన్ చెరువు ఎమ్మెల్యేపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టారని, రూ. 300 కోట్ల ఫైన్ వేసి నానా ఇబ్బం దులు పెట్టి కాంగ్రెస్ కండువా కప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ కండు వా కప్పగానే మైనింగ్ కేసు అటకెక్కిందని, పల్లా రాజేశ్వర్ రెడ్డిని ( palla rajeswar reddy) కూడా ఇబ్బందిపెట్టేలా అక్రమ కేసులు పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లాపై 6 కేసులు పెట్టారని, పల్లా రాజేశ్వర్ రెడ్డి భార్య, పిల్ల లపై కూడా కేసులు పెట్టారని, మానసికంగా, రాజకీయంగా, ఆర్థికం గా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం కుట్రలతో ముందుకు సాగుతోందని ఆరోపించారు.

న్యాయం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా హైడ్రా పేరుతో డ్రామాలు ఆడు తోందని దుయ్యబట్టారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికాలేజీ లు ఒక్క ఇంచు ప్రభుత్వ భూమి ఉంటే చెప్పండి 24గంటల్లో వారే తొలి గిస్తారని, మెడికల్ కాలేజీలో ఎంతో మంది వైద్యం పొందుతారని అక్కడ అన్ని అనుమతులతో కాలేజీ నిర్మించారని, ఉద్దేశయపూ ర్వకంగా కాలేజీల మీద దాడి చేస్తున్నారని, ఎఫ్టీఎల్ లో కాని, బఫర్‌ లో కాని లేదని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ ( irrigation depar tment) సర్వే రిపోర్ట్ ఇచ్చాయని గుర్తు చేశారు.

813 సర్వేనెంబర్లో ఎలాంటి బఫర్ భూమి లేదని అప్పటి జిల్లా కలెక్ట ర్ రిపోర్టు ఇచ్చారన్నారు. హెచ్ఎండీఏ (hmda)  పర్మిషన్ తోనే పర్మిషన్ ఉంద ని, పల్లాపై కేవలం రాజకీయంగా జరుగుతున్న కుట్ర మాత్రమేనని చెప్పారు. అక్రమాలను మేం ఎప్పటికీ సమర్థించబో మని, రాజకీ య ప్రేరేపితపై చర్యలను అధికారు ప్రేరేపించటం సరైం ది కాదని హితవు పలికారు.

అధికారం ఉందని రాత్రికి రాత్రే బుల్డోజింగ్ పద్ధతి (Bulldozing method) చేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అధికారు లు అత్యత్సహంతో పోవద్దని పరిశీలించండి, రాజకీయ కక్షల ను విద్యాసంస్థలు, ఆసుపత్రులపై రుద్దొద్దని సూచించారు. పల్లా రాజే శ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి లను టార్గెట్ చేసి సీట్లు పెంచుకొనే అవకాశం ఇవ్వలేదని అన్నారు.

మీడియా సమక్షంలో వాస్తవాలు సరి చూడాలని, ప్రభు త్వం కక్ష్య సాధింపు చర్యలు మాను కోవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులు బెడ్స్ దొరకతలేవు ప్రైవేట్ ఆసుపత్రులు బెడ్స్ కోసం మాకు ఫోన్ చేస్తున్నారని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే 36శాతం డెంగీ కేసులు పెరిగాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులే లేవని, గాంధీ ఆస్పత్రి( gandhi hospital) లో సింపుల్ మెడిసిన్ కూడా అందు బాటులో లేదని తెలిపారు.

రివ్యూ చేయాల్సింది ప్రజారోగ్యము పైన, రాష్ట్రంలో పారిశుధ్యం పడ కేసిందని, జ్వరాలతో రాష్ట్రం అతలాకుతం అవుతోందని, రాష్ట్రం లో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టి, ఒక్క డ్రైవ్ తీసుకోవాల్సింది అవసరం ఉందని సూచించారు. మంత్రులు రుణ మాఫీ పైన కుంటిసాకులు చెప్పు తు న్నారని, రుణమాఫీపైన వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పుడేమో సాంకేతిక కారణాలు చెప్పుతు న్నారు, గతంలో ఎందు కో రాలేదు సాంకేతిక కారణాలని ప్రశ్నిం చారు. ఆర్మూర్ లో రైతు లు భారీ ధర్నా చేపట్టారని, రైతులే రైతు సంఘాలే రోడ్ మీదుకు వచ్చి ఆందోళన చేస్తున్నాయని అన్నారు. డైవరషన్ పాలిటిక్స్ చేయడం రేవంత్ రెడ్డికి బాగా అలవాటు అయిందని, రుణమాఫీపై పెట్టిన గడు వులన్నీ జోక్ అయ్యాయని, ప్లానింగ్ లేక కుంటిసాకులతో గడు పుతున్నారని ఎద్దేవా చేశారు. తక్షణమే రైతు భరో సా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మేము 72వేలు కోట్ల రూపాయలు రైతుబంధు ఇచ్చామని, రూ. 30 వేల కోట్లు రుణమాఫీ చేశాo కానీ అప్పులు పేర్లు చెప్పి తప్పించుకొనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. అలివికాని హామీ లు ఇచ్చి గత ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే ప్రయత్నం చేస్తున్నా రని ఆగ్ర హం వ్యక్తం చేశారు.

ఎనిమిది నెలల్లో రూ. 65 వేల కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నెల కు రు. 8125 కోట్లు ఈ ప్రభుత్వం అప్పు చేస్తుందని, ఈ క్రమంలో అంటే ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేయబోయే అప్పు రూ.4 లక్ష ల 87 వేల 500 కోట్లని వివరిం చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సం వత్సరాలలో రూ. 4 లక్ష ల 26వేల అప్పు మాత్రమే చేసిందని, ఎఫ్ ఆర్ బి ఎం కింద రూ. 42,118 కోట్లు అప్పు చేసిందని, వివిధ కార్పొరేషన్ల నుండి రూ.22, 840 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం విమర్శించారు.

ఈ ఎనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపో మొత్తం 65 వేల కోట్లని, రేవంత్ రెడ్డి నీకు అప్పులు గురించి మాట్లాడే హ క్కు ఉందా, ఆస్తుల కల్పన చేశాం, అన్ని వర్గాల వారికి సంక్షే మాన్ని అందించాం, ఉప ముఖ్య మంత్రి అబద్ధాలు ప్రచారం చేస్తు న్నరని, అడ్డగోలు హామీలు ఇచ్చి నెరవేర్చలేక బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరో పణలు చేస్తున్నరని ధ్వజ మెత్తారు.

పరిపాలనంతా ఆగ మాగం చేశారని, పంచాయతీ సెక్రెటరీలు మాస్ లీవ్ పెట్టాలని నిర్ణయం తీసుకుంటున్నరని సూచిం చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు ఇవ్వలేదని, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ అటకెక్కిందని, సమస్యల వలయంలో రాష్ట్రం ఉంటే రాజకీయ కుట్రలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు.