–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : సోమవారం ప్రజావాణి సందర్బంగా జిల్లాలోని ఉలేమాలు దరఖాస్తు సమర్పించిన సందర్భంలో తాను ఎవరిని కులం, మతం పేరు తో అవమానపరచడం, కించపరచడం చేయలేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజావాణి లో భాగంగా ఇజ్రాయిల్ యుద్ధ సంఘటనకు సంబంధించి జిల్లాలోని కొంతమంది ఉలేమాలు తనకు దరఖాస్తును సమర్పించగా స్వీకరించడం జరిగిందని, వారు దరఖాస్తు సమర్పించిన సందర్భంలోనే వారికి సంబంధంలేని, హైదరాబాద్ కు చెందిన ముస్లిమేతర మహిళ దేవి అనే మహిళ జిల్లా కలెక్టర్ ను “నువ్వు” “నువ్వు”అని సంబోధించడమే కాక , జిల్లా అధికారులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందని తెలిపారు. అయినప్పటికీ తాను ఆమెకు సముచితంగా సమాధానం చెప్పి ప్రజావాణి నుండి పంపించడం జరిగిందని పేర్కొన్నారు.
ప్రజావాణికి వచ్చిన వారిని తాను ఎన్నడూ అవమానించలేదని, అందరితో మర్యాద పూర్వకంగానే మాట్లాడి పంపించడం జరుగుతున్నదని వెల్లడించారు.సోమవారం నాటి ప్రజావాణిలో ప్రత్యేకించి ఉలేమాలను తాను అవమానపరచడం లేదా కించపరచారనడం నిజం కాదని కలెక్టర్ స్పష్టం చేశారు.