District Collector Ila Tripathi : నేనెవరిని అవమానపరచలేదు
--జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : సోమవారం ప్రజావాణి సందర్బంగా జిల్లాలోని ఉలేమాలు దరఖాస్తు సమర్పించిన సందర్భంలో తాను ఎవరిని కులం, మతం పేరు తో అవమానపరచడం, కించపరచడం చేయలేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజావాణి లో భాగంగా ఇజ్రాయిల్ యుద్ధ సంఘటనకు సంబంధించి జిల్లాలోని కొంతమంది ఉలేమాలు తనకు దరఖాస్తును సమర్పించగా స్వీకరించడం జరిగిందని, వారు దరఖాస్తు సమర్పించిన సందర్భంలోనే వారికి సంబంధంలేని, హైదరాబాద్ కు చెందిన ముస్లిమేతర...