–నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పదవీ విరమణ
IAS officer Retirement: ప్రజా దీవెన, అమరావతి: ఆంద్రప్రదేశ్ లో (andhra pradesh) నలుగురు ఐఏఎస్ అధికారుకు పదవీ విరమణ చేశారు. మాజీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డితో (KS Jawahar Reddy) పాటు పూనం మాలకొండయ్య (Poonam Malakondaiah), కె.వెంకటరమణారెడ్డి (K. Venkataramana Reddy), హెచ్.అరుణ్ కుమార్ (H. Arun Kumar) రిటైరయ్యారు. మాజీ సీఎ స్ కేఎస్ జవహర్ రెడ్డితో పాటు పూనం మాలకొండయ్య, కె.వెంకట రమణారెడ్డి, హెచ్.అరుణ్‌కుమార్ రిటైరయ్యారు.
ఈ నెల 30వ తేదీతో వారికి 60 ఏళ్లు పూర్తవు తాయి. 29, 30 తేదీలు శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో రెండ్రోజుల ముందే వారు పదవీ విరమణ చేశారు. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ (CS Nirab Kumar Prasad) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా పదవీ విరమణ నేపథ్యంలో జవహర్ రెడ్డి, పూనంకు ప్రభుత్వం గురువారం పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ తీసుకున్న జవహర్‌రెడ్డి రిటైర్ కావడంతో ఇన్‌చార్జిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాముకు అదనపు బాధ్యతలు అప్పగిం చారు. జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న పూనం మాలకొండయ్య స్థానంలో పోలా భాస్కర్‌కు (Pola Bhaskar) అదనపు బాధ్యతలు అప్పగించారు.