–గోలి మధుసూదన్ రెడ్డి
Etela Rajender : ప్రజాదీవెన , నల్గొండ : మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు ఎంపీ ఈటెల రాజేందర్ పై కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి వీధి రౌడీ తరహాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమనీ, వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు, కేరళ ఇంచార్జ్ గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు లోకనబోయిన రమణ ముదిరాజ్ లు తెలిపారు. సోమవారం నల్లగొండలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాజకీయ నాయకులు పరస్పర గౌరవంతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్న ఈ రోజుల్లో, ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతిని దిగజార్చడమే అవుతుందన్నారు. ఈటెల రాజేందర్ ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తూ, తనదైన ముద్ర వేసిన నాయకుడనీ, ఆయనపై ఇటువంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ, జగ్గారెడ్డి తమ స్థాయిని తామే తగ్గించుకున్నారన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ జగ్గారెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.
భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సమస్యలపై పోరాడుతూ, నీతి నిజాయితీతో రాజకీయాలు చేసే పార్టీ అనీ, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మా పోరాటాన్ని ఆపలేవనీ పేర్కొన్నారు. ప్రజలు మీలాంటి చీప్ రాజకీయాలను గమనిస్తున్నారు. తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో
బిజెపి జిల్లా కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, కోశాధికారి ఫకీరు మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మిరియాల వెంకటేశం, గడ్డం మహేష్, శివరామకృష్ణ, మంగిలిపల్లి కిషన్, గంగాధరి శ్రీనివాస్, జిట్టబోయిన రమేశ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.