Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Operation Sindoor : ఆపరేషన్ సింధూర్ తో భారత సైన్యం సరైన సమాధానం

— రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, స మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Operation Sindoor :ప్రజా దీవెన నకిరేకల్: మతం ము సుగులో ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచిన పాకిస్తాన్ ఉగ్రమూకలకు భారత సైన్యం సరైన రీతిలో ఆపరే షన్ సింధూర్ పే రుతో సరైన జవా బు చెప్పిందని రాష్ట్ర రెవెన్యూ, గృ హనిర్మాణ, సమాచార పౌర సంబం ధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి అన్నారు.

గురువారం అయన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి ఎంపీడీవో కార్యాల యం వరకు భారత సైన్యానికి మద్ద తుగా నిర్వహించిన సంఘీభావ ర్యాలీని జండా ఊపి ప్రారంభించా రు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ భారత సైన్యానికి మద్దతుగా నకరికల్ లో ర్యాలీ నిర్వహించడం సంతోషమని అన్నారు. పహల్గాం దాడి అమానుషమని, మతాన్ని అడ్డం పెట్టుకుని ఉగ్రవాదులు మన ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచివే శారని, అలాంటి పాకిస్తాన్ మూక లకు గత వారం రోజుల్లో ఆలోచిం చి ఆపరేషన్ సింధూర్ పేరుతో దా డులు జరిపి కాశ్మీర్ దాడిలో పా ల్గొ న్న ఉగ్రమూకలందరికి బుద్ధి చెప్ప డం జరిగిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర పక్షాన భారత సైన్యానికి మద్దతుగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత సైన్యానికి అభినందనలు తెలిపా రు. అన్ని సెక్టర్ల సైన్యానికి ప్రభుత్వ మద్దతు ఉంటుందని ,రాబోయే రో జుల్లో తెలంగాణ అన్ని రకాల సహా య సహకారాలను సైన్యానికి అం దిస్తుందని,అలాగే కేంద్రానికి ఈ విషయంలో తోడుగా నిలుస్తుందని తెలిపారు.

భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మా ట్లాడుతూ నకిరేకల్ శాసనసభ్యు లు వేముల వీరేశం, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మం దుల సామెల్, ఎమ్మెల్సీ శంకర్ నా యక్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ,ఇంచార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారా యణ అమిత్, ఇతర ప్రజాప్రతిని ధులు, అధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.