–అందుబాటులో ఉన్నవి తీసుకున్నా మేలే
–పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం వల్ల ముంచెత్తుతున్న వ్యాధులు
–గ్రామీణ మహిళలకు పోషకాహారంపై కొరవడిన అవగాహన
–పోషకాలు ఎంత మోతాదులో తీసుకోవాలో సూచిస్తున్న ఐసీఎంఆర్, ఎన్ఐఎన్
–విధి గా రోజు 2 వేల కేలరీలకు పైగా నే ఆహారం తీసుకోవాలి
–యోగా, ధ్యానం తో ఒత్తిడి దూరం
Indian Council of Medical Research: ప్రజాదీవెన నల్గొండ : మహిళలు ఇంటి పనులతో పాటు కుటుంబ వ్యవహారాల్లో పడి తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా కూలీలు, రైతులు శరీరానికి సరిపడా పోషకాలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం వల్ల వ్యాధులు ముంచెత్తుతున్నాయి. మధ్యస్థ మహిళా కూలీలు, అధిక శారీరక శ్రమ చేసే మహిళలు వారి కష్టానికి అనుగునంగా ఆహారాన్ని తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో శ్రమకోర్చే మహిళలకు పోషకాహారంపై అంతగా అవగాహన ఉండడం లేదు. పోషకాలు ఎంత మోతాదులో తీసుకోవాలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్(ఐసీఎం ఆర్, ఎన్ఐఎన్) సిఫార్సులు చేసింది. మహిళల ఆహారం విషయంలో తీసుకోవాల్సిన సూచనలను వైద్యనిపుణులు వివరిస్తున్నారు.
–హైరానా వద్దు..
ఆర్థికంగా కింద స్థాయిలో ఉన్నవారికి బాదం, కిస్మిస్, పిస్తా, నట్స్, గుమ్మడితో పాటు ఇతర గింజలు కొనుగోలు చేసే పరిస్థితి ఉండకపో వచ్చు. తమకు అధిక పోషకాలు తినాలంటే డబ్బులు చాలా అవసరమని హైరానా వద్దు. అందుబాటులో ఉన్న వాటిలోనే పోషకాలు ఇచ్చేవి ఉన్నాయి. క్రమం తప్పకుండా తీసుకోవాలి. ప్రధానంగా మహిళ కూలీలు, రైతులు అధికశ్రమ కూలీలు, మీరు తప్పనిసరిగా రోజు 2000 కేలరీలకు పైగా నే ఆహారం తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో లభించే తక్కువ ధర కలిగిన వాటితోనూ ఆరోగ్యంగా ఉండొచ్చు. అదిక ధర కలిగిన పండ్లు, ఇతర ఆహార పదార్ధాలను అప్పుడప్పుడు తినేలా చూసుకోవాలి. నూనెను ఆహారంలో తగ్గించాలి. వేపుళ్లు, చిరుతిళ్లు తగ్గిస్తే మంచిది. గృహిణుల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. యోగా, ధ్యానం వంటివి చేస్తే ఒత్తిడిని చాలా మేరకు తగ్గించుకోవచ్చు. రోజూ 3 నుంచి 4 లీటర్ల స్వచ్ఛమైన నీళ్లు తాగాలి. ఒకేసారి కాకుండా గంటల వారీగా విభజించి తాగితే మంచిది. అలసట అనిపిస్తే రోజులో కొంత సమయం విశ్రాంతి తీసుకో వాలి.
గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ మిద్దె తోటలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. మంచి పోషకాలను అందించే జామా, బొప్పాయితో పాటు నిమ్మను పెంచుకోవాలి. వీటికి పెద్దగా ఖర్చు చేయాల్సిన పని లేదు. అధిక ధర కలిగిన పండ్లను తినలేన ప్పుడు ఇవి మనకు ఆరోగ్యాన్ని పంచుతాయి. ఆహారంలో రోజూ 50 గ్రాముల ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. మునగాకు, తోట కూర, పాలకూర తినడంతో రక్తహీనత రాకుండా ఉంటుంది.
–ఇలా తినొచ్చు..
–ఉదయం పరిగడుపున నిమ్మకాయ (సగం) 200మి.లీ నీళ్లు తాగాలి.
–అల్పాహారంలో రాగి, జొన్న, సాదా ఇడ్లీలు, జొన్న, రాగి దోసెలు, జొన్న గటుక 75 గ్రాములు తినవచ్చు. పల్లి, కొబ్బరి, శనగ పప్పు చట్నీ తినాలి. (వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి)
–ఉదయం 11 గంటలకు వేయించిన(నూనె లేకుండా) శనగలు, ఉడికించిన గుడ్డు తినాలి.
మధ్యాహ్న భోజనం….
–అన్నం(100గ్రా), గోధుమ చపాతీ (3), జొన్న రొట్టెలు 2, జొన్న సంకటి(2 కప్పులు) వీటిలో ఏదో ఒకటి.
–పప్పు 1 కప్పు, కూరగాయలు ఒకటి న్నర కప్పు, ఆకుకూరలు సగం కప్పు, చికెన్, మటన్, చేపలు, ఒక కప్పు(వారానికి 1 లేదా 2 సార్లు).
—-సాయంత్రం 4గంటలకు…
టీ, కాపీ, మజ్జిగ, పాలు (100మి.లీ), అటుకులు,
మరమరాలు, శనగలు లేదా పండ్లు.
—రాత్రి భోజనం….
అన్నం(100గ్రాములు), చపాతీలు 3, జొన్న ఘటక(ఒక కప్పు) వీటిలో ఏదో ఒకటి కందిపప్పు, పన్నీరు, రాజ్మా శనగల కూర, పచ్చి బఠాణి(ఒక కప్పు), కూరగాయల మిశ్రమం, ఆకుకూరలు, పెరుగు (ఒక కప్పు).
—నిద్రించే ముందు…
పాలు (150మి.లీ), ప్రతిరోజు ఏదో ఒక పండు ఉండేలా చూసుకోవాలి.