— నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్య క్షుడు పున్న కైలాష్ నేత
President Punna Kailash : ప్రజా దీవెన, నల్లగొండ: భారత 77వ గణతంత్ర వేడుకల సందర్భం గా నల్గొండ పట్టణంలోని శివాజీ నగర్ టిటిడి కళ్యాణ మండపం వ ద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కా ర్యక్రమం నల్గొండ డిసిసి ఆధ్వ ర్యంలో జరిగింది ఈ కార్య క్రమా నికి ముఖ్యఅతిథిగా డిసిసి జిల్లా అధ్యక్షులు పున్న కైలాష్ నేత హా జరై జాతీయ జెండాను ఎగరవేసి వందన సమర్పణ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ దేశ ప్రజలు తమను తాము పాలించుకొని ప్రజాస్వామ్య వ్యవ స్థని బలోపేతం చేయడానికి డా, B.R అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించారని ఆయన కొనియాడా రు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ దేశంలోని పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఆదివాసులకు దళిత మైనారిటీల అభివృద్ధికి చ ట్టాలు చేసి వారిని బలోపేతానికి కృషి చేశారని ఆయన కొనియాడా రు.
నేడు కేంద్రంలోని బీజేపీ మోడీ స ర్కార్ పేదల సొమ్మును అంబానీ అథానిలకు దోచి పెడుతుందని అ న్నారు .నెహ్రూ ఇందిరా మన్మోహన్ సింగ్ ప్రధానుల కాలంలో చేసిన అ నేక పథకాల రద్దు వెనుక బీజేపీ కు ట్ర దాగి ఉందని అన్నారు.25 కోట్ల మంది కి ఉపయోగపడే MNRE GA పథకానికి బీజేపీ తోట్లు పొడి చిందని BC SC ST మైనారిటీల పై న రాజ్యాంగపరమైన హక్కులను హరించి భారత రాజ్యాంగానికి పే న్నుమోప్పు వాటిల్లే విధానాలను అవలంబిస్తుందని ఆయన ఆందో ళన వ్యక్తం చేశారు.
2029 లో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావడం తధ్యం అని ,2029 లో రాష్ట్రంలో మరోమారు రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా OBC సెల్ చైర్మన్ జిల పల్లి పరమేష్, జిల్లా SC సెల్ చైర్మన్ బోడ స్వామి,BC సంక్షేమ సంఘం దుడుకు లక్ష్మీ నా రాయణ, సేవాదళ్ రాష్ట్ర కార్య ద ర్శి గండూరి నరసింహ,సీనియర్ జిల్లా నాయకులు M.D ముంతాజ్ అలీ, కర్నాటి యాదగిరి, గౌతమ్ , శివ, నాగార్జున గౌడ్, రవీందర్ రె డ్డి, వేముల గోపీనాథ్, బోడ అరు ణ్,లోడంగి మహేష్,శరత్, వినీ త్,పగిళ్ల శివ,కౌశిక్, జశ్వంత్, కార్తీ క్ తదితరులు పాల్గొన్నారు.
