District Collector Ila Tripathi : ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ను పెంచాలి
--జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి --నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : నల్గొండ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ను పెంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె నల్గొండ మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నల్గొండ నియోజకవర్గ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై గృహనిర్మాణ శాఖ అధికారులు, తహసిల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఆయా మండలాల వారిగా సమీక్ష సందర్భంగా నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 గృహాలు కేటాయించగా, మొదటి ,రెండో విడతలో...