— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీడీవోలతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల సమీక్ష సందర్భంగా ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయడంతోపాటు, ఎవరైనా లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్తోమత లేనట్లయితే స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా
రుణం ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల ను దృష్టిలో ఉంచుకొని ఓటరు జాబితాను అప్డేట్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గ్రామీణభివృద్ధి, తదితర అంశాలపై సమీక్ష చేశారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ ,గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, డిపిఓ వెంకయ్య, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జెడ్పి సీఈఓ శ్రీనివాసరావు, గనుల శాఖ ఏ డి శామ్యూల్ జాకబ్, తదితరులు హాజరయ్యారు.