Nalgonda Hospital Baby Death : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి కలకలం రేపింది. ప్రసవం కోసం నల్ల గొండ ప్రభుత్వాసుపత్రికి వచ్చిన తల్లి చావు బతుకులో ఉండడం శిశువు మరణించడంతో కారణమై న వైద్యుల నిర్లక్ష్యమే అంటూ కు టుంబ సభ్యులు బంధువులు, లం బాడి హక్కుల పోరాట సమితి ఆ ధ్వర్యంలో శుక్రవారం ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కుటుంబ సభ్యులు తెలిసిన వివ రాలు ప్రకారం దేవరకొండ నియోజ కవర్గం గుడిపల్లి మండలం కేశినేని తండాకు చెందిన జటావత్ ఝాన్సీ మొదటి కాన్పు కోసం ఈనెల 6 వ తేదీన ఆసుపత్రులో ఇన్ పేషంట్ గా చేరారు. అయితే ఆమెకు ప్రాథమిక చికిత్సనందిస్తున్న క్రమం లో గురువారం పురిటినొప్పులు రాగా పరిశీలించిన డాక్టర్లు స్కానిం గ్ రాసి అనంతరం పరిశీలించగా కడుపులోని పాప చనిపోయిందని నిర్ధారించారు. మృత శిశువును డా క్టర్లు డెలివరీ చేశారు. అనంతరం తల్లి పరిస్థితి విషమించడంతో హై దరాబాదులోని గాంధీ ఆసుపత్రికి రె ఫర్ చేశారు.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఝాన్సీ శుక్రవా రo ప్రభుత్వం డాక్టర్ల నిర్లక్ష్యమే కార ణమని వైద్యం వికటించి చనిపో యారని ఆరోపిస్తూ సదరు మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బంధువులకు నచ్చజెప్పిన వినక పోవడంతో ఆర్డీవో అశోక్ రెడ్డి ఆం దోళనకారుల వద్దకు వచ్చి ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.