Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Insta post, BJP, vairal postవివాదంలో మహిళా క్రికెటర్ పోస్టు 

 

ముంబై : దేశంలో పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ మహిళా క్రికెటర్ పెట్టిన పోస్ట్ వివాదంలో పడి, తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వివరాల్లోకెళితే.. భారత మహిళా క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రకార్‌ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు పీఎం నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ల మార్ఫింగ్ ముఖాలతో కూడిన ఫోటోను వసూలి టైటాన్స్ అనే హెడ్డింగ్ తో పోస్ట్ చేసింది. అలాగే ఈ పోస్టుకు ఇంపాక్ట్ ప్లేయర్ ‘ఈడి’ అంటూ జత చేసింది. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ కావడంతో పూజ వస్త్రకార్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ పోస్టు చూసినవారు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడంతో పూజ వస్త్రకర్ ఈ పోస్టును వెంటనే తొలగించింది. ఇదిలా ఉండగా తన ప్రమేయం లేకుండా ఈ పోస్ట్ వచ్చిందని ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పింది.