–నేటి నుండి 29 వరకు జరగనున్న పరీక్షలు
— జిల్లా నుండి 11376 జనరల్,1578 ఓకేషనల్, మొత్తం 12954 మంది పరీక్షలకు హాజరు
— ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు పరీక్షల నిర్వహణ
–జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దశ్రు నాయక్
Inter Supplementary Examinations: ప్రజాదీవెన నల్గొండ : ఈనెల 22 నుండి 29 వరకు ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దశ్రు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలకు జిల్లా నుండి 11376 మంది సాధారణ విద్యార్థులు, 1578 మంది ఒకేషనల్ విద్యార్థులు, మొత్తం 12954 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 నుండి 12 వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు రెండవ సంవత్సరం పరీక్షలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
22వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వన్ ఉంటుందని, మధ్యాహ్నం లాంగ్వేజ్ పేపర్ టు, 23న ఇంగ్లీష్ పేపర్ వన్, మధ్యాహ్నం ఇంగ్లీష్ పేపర్ టు, 24న ఉదయం మొదటి పేపర్ మ్యాథమెటిక్స్, బాటని, పొలిటికల్ సైన్స్, మధ్యాహ్నం మ్యాథమెటిక్స్ బాటని,పొలిటికల్ సైన్స్ పేపర్ టు ఉంటాయని, 25న మ్యాథమెటిక్స్ పేపర్ వన్ బి, జువాలజీ పేపర్ వన్, హిస్టరీ పేపర్ వన్, మధ్యాహ్నం మ్యాథమెటిక్స్ పేపర్ 2 బి, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ టు, 26న ఉదయం ఫిజిక్స్ పేపర్ వన్, ఎకనామిక్స్ పేపర్ వన్, మధ్యాహ్నం ఫిజిక్స్ పేపర్ టు, ఎకనామిక్స్ పేపర్ టు ఉంటాయని, 27న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ వన్, మధ్యాహ్నం కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ టు, 28న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ వన్, బ్రిడ్జి కోర్స్ మాథ్స్ పేపర్ వన్ ఉంటాయని, మధ్యాహ్నం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ టు, బ్రిడ్జి కోర్సు మాథ్స్ పేపర్ టు ఉంటాయని, 29 మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ వన్, జాగ్రఫీ పేపర్ వన్, మధ్యాహ్నం మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ టు, జాగ్రఫీ పేపర్ 2 లు ఉంటాయని తెలిపారు.
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు గాను మొత్తం 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుండి 6 వరకు ఉదయం 9 నుండి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు నాలుగు రోజులపాటు నిర్వహించనున్నట్లు డిఐఈఓ పేర్కొన్నారు . మొదటి సంవత్సరం ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ జూన్ 9న, అలాగే 10వ తేదీ రెండు రోజులు ఉంటుందని చెప్పారు. ఎన్విరాన్మెంటల్ ఎగ్జామినేషన్ జూన్ 11న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని, ఎథిక్స్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ జూన్ 12న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒకటి వరకు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థులకు మాత్రం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.