Interested in the first announcement of the candidates…! అభ్యర్థుల తొలి ప్రకటనకు ఆసక్తి…!
-- కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా రెడీ --నలభై పేర్లు సిద్ధంచేస్తున్న పి ఈ సి -- వచ్చే నెల ప్రారంభంలో ముహూర్తం
అభ్యర్థుల తొలి ప్రకటనకు ఆసక్తి…!
— కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా రెడీ
–నలభై పేర్లు సిద్ధంచేస్తున్న పి ఈ సి
— వచ్చే నెల ప్రారంభంలో ముహూర్తం
ప్రజా దీవెన/హైదరాబాద్: తర్జన భర్జన ల మీదట అభ్యర్థుల ప్రకటనకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సర్వం సిద్ధo చేసింది. సెప్టెంబరు మొదటి వారంలో 35 నుంచి 40 పేర్లతో తొలి జాబితా విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గాంధీ భవన్‌లో మంగళవారం భేటీ కానున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ కాంగ్రెస్ తొలి జాబితాలో 35 నుంచి 40 పేర్ల వరకు తుది పరిశీలన అనoతరం అందరి అభిప్రాయం మేరకుఅధిష్ఠానం ఆమోదంతో వచ్చే నెల ప్రారంభంలో ప్రకటన కు ముహూర్తం ఖరారు చేయనున్నారు.
కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 25న ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 119 నియోజకవర్గాలకు 1,016 మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. సదరు దరఖాస్తుల నిశిత పరిశీలన కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చైర్మన్‌గా ఏర్పాటైన పీఈసీ గాంధీ భవన్‌లో మంగళవారం సాయంత్రం 4గంటలకు భేటీ అవుతోంది. ఆశావహుల దరఖాస్తులను పరిశీలించి, పోటీ చేయగల సామర్థ్యాలు ఉన్న వారిని నియోజకవర్గానికి ముగ్గురు నుంచి నలుగురిని పీఈసీ ఎంపిక చేయనుంది.
సర్వేలు, సీనియారిటీ తదితర అంశాల ఆధారంగా ఏకాభిప్రాయం ఉన్న 35-40 స్థానాల్లో ఒకే ఒక పేరు ను పీఈసీ ఎంపిక చేయనున్నట్లు సమచారం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, సీఎల్పీ నేత భట్టి, సిటింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వంటి ఏకాభిప్రాయం ఉన్న పేర్లను ‘సింగిల్ నేమ్’గా ఎంపిక చేసి స్ర్కీనింగ్ కమిటీకి సిఫారసు చేయనున్నట్లు చెబుతున్నారు.
స్ర్కీనింగ్ కమిటీ భేటీలోనూ ఈ పేర్లను ఖరారు చేసి కేంద్రఎన్నికల కమిటీకి సిఫారసు చేయడం ఆ తర్వాత అధిష్ఠానం ఆమోదంతో తొలి జాబితా విడుదల చేయడం చక చక జరిగిపోనున్నట్లు పార్టీ వర్గాల్లో విస్త్రుత ప్రచారం జరుగుతోంది.