International Women’s Day: ప్రజా దీవెన , మిర్యాలగూడ: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నల్లగొండ జిల్లాలో ఐద్వా ఆధ్వర్యంలో మండల పట్ట ణ కేంద్రాలలో విజయవంతం చే యాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు పోలేబోయిన వరలక్ష్మి ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి పిలుపునిచ్చారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో ఐద్వా పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలం చెందుతుందని అన్నారు. ఆర్టీసీ బస్సు మినహాయించి ఏ ఒక్కటి అమలు కావడం లేదని అన్నారు. ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నా మాట ఏమైందని ప్రశ్నించారు?.
కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారని అవి నీటి మూటలేనా అని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కొరకు మార్చి నెల సర్వేలు రిలే నిరాహార దిక్షలు ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున మహిళా లను కదిలిస్తామని తెలిపారు. విద్యా వైద్యం అందించుటలో ప్రభుత్వాలు వెనకబడుతున్నాయని, ప్రభుత్వం దావఖనలు లో సరియైన వైద్యం అందడం లేదని తెలియజేశారు.
పెరుగుతున్న ధరలు మరొక పక్క నిరుద్యోగం, పనులు లేకపోవడంతో ప్రజలు దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారని అన్నారు. పట్టణ కేంద్రాలలో ఉపాధి పనులు కల్పించుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ అభయ హస్తం భూమిలేని ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలని కోరారు. పోరాటాలకు పెద్ద ఎత్తున మహిళలు కదిలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలోఐద్వా జిల్లా నాయకులు అరుణ బీబామ్మ, పూలమ్మ తదితరులు పాల్గొన్నారు.