Irregularities in society: ప్రజా దీవెన, నిడమానూరు: నిడమనూరు మండలంలోని వెనిగండ్ల సహకార సొసైటీ నిర్వహణలో (management of a co-operative society) అన్ని అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, సిబ్బంది ఇస్తాను రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, మండల కార్యదర్శి కందుకూరు కోటేశ్ లు ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెనిగండ్ల సొసైటీలో రైతుల నుండి అడ్డగోలుగా వడ్డీ వసూలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని, ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో 8 నెలలకు గాను 9 నెలల వడ్డీ వసూలు చేస్తూ, అడ్డగోలుగా అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని వారన్నారు. సొసైటీ నిర్వహణ సక్రమంగా లేదని, సీఈఓ ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారని, ఫైళ్లపై సీఈఓ సంతకాలు ఇద్దరు చేస్తూ సొసైటీ నిర్వాహన గాలికి వదిలేసి ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని అమాయక పేద రైతులను మోసం చేయడానికి సొంత ఎజెండాతో పని చేస్తున్నారని వారన్నారు. రుణాల మంజూరులో ( sanction of loans) రుణాలు పెంచిస్తామని చేతివాటం ప్రదర్శిస్తూ, అక్రమాలకు సిబ్బంది పాల్పడుతున్నారని వారన్నారు. తప్పులు తడకగా రుణమాఫీ రైతుల లిస్టు ఉందని, రైతుల పూర్తి వివరాలను నమోదు చేయడంలో లోపం జరిగిందని, తండ్రుల పేర్లు ఇంటి పేర్లు, భర్తల పేర్లు తారుమారుగా లిస్టు చేసి పంపడంతో రుణమాఫీలబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారనివారన్నారు.
వెనిగండ్ల సొసైటీలో సిబ్బంది రైతులకు (farmers) అందుబాటులో ఉండడం లేదని, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని వారు అన్నారు రైతులు (farmers) తిరిగి, తిరిగి తిట్టుకుంటూ పోతున్నారని, సొసైటీ నిర్వహణ సిబ్బందితో ఇష్టానుసారంగా నడుపుతున్నారని, వారికి ఎవరి వల్ల గాని ఇటువంటి భయం, బాధ్యతలు లేవని వారన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం బాధ్యత రైతం పట్ల జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, అక్రమాలపై (irregularities) విచారణకు అధికారులను కోరుతామని వారు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని, 50 శాతం మంది రైతులకు మాత్రమే డబ్బు చేకూరిందని పూర్తిగా మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. వెనిగండ్ల సొసైటీలో 620 మంది రైతులు లక్ష రుణాలు తీసుకున్నారని కేవలం 380 మంది రైతులకు మాత్రమే మాపీ వర్తించిందని, లక్షన్నర తీసుకున్న రైతులు 100 మంది ఉన్నారని 60 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని, వడ్డీతో (intrest) కలిపి 2 లక్షలు మాఫీ అయిన రైతులు 20 మంది ఉన్నారని ఈ విధంగా చూస్తే 50 శాతం కూడా సొసైటీలో రైతులకు రుణమాఫీ చేయలేదని వారు అన్నారు.
నిడమనూరు సొసైటీలో లక్ష తీసుకున్న రైతులు (farmers) 1126 మంది ఉన్నారని, వీరిలో 496 మందికి మాత్రమే రుణమాఫీ వర్తించిందని, లక్షన్నర తీసుకున్న రైతులు 343 మంది ఉన్నారని 253 మంది మాత్రమే మాఫీ వర్తించిందని వారు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా తప్పకుండా అర్హులైన ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీని (Loan waiver)చేసి ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వారు సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిచో లబ్ధిదారులతో ఆందోళనలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కోమాండ్ల గురువయ్య, కుంచెం శేఖర్, తోటపల్లి బాల నారాయణ, కోదండ చరణ్ రాజు, వింజమూరు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.