Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ISRO:రామసేతు వాస్తవమే..!

–కీలక వివరాలు వెల్లడించిన ఇస్రో

ISRO:ప్రజా దీవెన, ఇస్రో:రామసేతు (Ram Setu) గురించి అందరికీ తెలి సిందే. రామాయణకాలంలోనే నిర్మించిన వారధి అని భారతీయుల విశ్వాసం, నమ్మకం. దీన్ని భారతీ య అంతరిక్ష పరి శోధనా సంస్థ (ISRO) పరిశోధన సైతం ధ్రువీకరి స్తుoది కూడా. రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవుల (Mannar Islands) వరకు ఈ వారధి ఉంటుంది. అయితే, రామసే తుకు సంబంధించిన పలు రహస్యాల ఛేదనలో ఇస్రో మరో మైలురాయిని చేరింది. నాసాకు చెందిన ఉప గ్రహం సహాయంతో తొలిసారిగా ఆడమ్ బ్రిడ్జిగా పిలిచే రామసేతు మ్యాప్ను సిద్ధం చేసింది. ఈ వంతె నకు సంబంధించిన ఫొటో లను తాజాగా విడుదల చేసింది. ఇస్రో రూపొందించిన పది మీటర్ల మ్యాప్లో మొత్తం వంతెన కనిపిస్తుం డడం విశేషం.

ఇస్రో (isro)అమెరి కాకు చెందిన ఉపగ్రహం ఎన్శాట్2 (ACESAT- 2) డేటాను వినియో గించి సేతుకు సంబంధించిన మ్యాప్ను సిద్ధం చేసి విడుదల చేశారు.అక్టోబర్ 2018 నుంచి 2023 అక్టోబర్ మధ్య ఆరు సంవత్సరాల డేటాను సిద్ధం చేశారు. ఇస్రోకు చెందిన జోధ్ పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ (National Remote Sensing) సెంటర్ల శాస్త్రవేత్తలు దీనిపై ఓ జర్నల్లో నివేదిక ప్రచురితమైంది. భారత్, శ్రీలంక మధ్యనున్న ఈ రామసేతు పొడవు 29 కిలోమీటర్ల ఉంటుంది. సముద్రగర్భం నుంచి దీని ఎత్తు 8 మీటర్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ సేతు 99.98 శాతం నీటిలో మునిగి ఉన్నట్లుగా శాస్త్రవే త్తలు (Scientists) తెలిపారు. రామాయణ కాలంలో లంకాధిపతి రావణుడు సీతమ్మ అమ్మవారిని అపహరించాడు. ఆమెను అక్కడే ఉంచాడు. హనుమంతుడు లంకా యాణం చేసి సీతమ్మ జాడను కనుగొంటాడు. ఆ తర్వాత లంకకు చేరుకునేందుకు సముద్రంపై వంతె నను వానరసేన నిర్మించింది. ఆ సేతుపై నుంచే వాన రసేన లంకకు చేరుకుంది. అయితే, క్రీస్తుశకం 9వ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను ‘సేతు బంధై’ గా పిలుస్తుండే వారు. రామేశ్వరం ఆలయ రికార్డుల (Rameswaram Temple Records)ప్రకారం.. ఈ వంతెన 1480 వరకు తుఫా నులతో ధ్వంసమైంది. అంతకు ముందు సముద్రమ ట్టానికి పైనే ఉండేది.