
— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, కనగల్: విద్యార్థులు ఉపకార వేతనాలు పొందేందుకు తహసిల్దార్లు జాప్యం లేకుండా కుల, ఆదాయ ధ్రువపత్రా లను జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇందు కుగాను అవసరమైతే ప్రత్యేక శిబి రాన్ని ఏర్పాటు చేసి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నింటిని త్వరిత గతిన పూర్తిచేయాలని ఆమె ఆర్డిఓ, డిఈఓలను ఆదేశించారు. మంగళ వారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో పలు ప్ర భుత్వ సంస్థలను ఆకస్మికంగా తని ఖీ చేశారు.
ముందుగా ఎంపీడీవో కార్యాల యంలో ప్రిమెట్రిక్ ఉపకార వేత నా ల పంపిణీ పై వచ్చిన దరఖాస్తులు, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు, ద రఖాస్తుల శాతాన్ని ఎంపీడీవో, త హసీల్దార్ ల ద్వారా అడిగి తెలుసు కున్నారు.
ఈ సందర్భంగా ధ్రువపత్రాల కార ణంగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలుసుకొని కుల, ఆ దాయ ధ్రువ పత్రాలను జారీ చే సేం దుకు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చే సి తక్షణ చర్యలు చేపట్టాలని నల్గొం డ ఆర్డివో అశోక్ రెడ్డి ,డిఈవో బిక్షప తిలను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల పై సమీక్ష నిర్వహిస్తూ పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేసుకునేలా లబ్ధిదారులకు అవగా హన కల్పించాలన్నారు. అలాగే పెం డింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లు లను సైతం వెంటనే చెల్లించాల్సిం దిగా గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ ను ఆదేశించారు.
ఆ తర్వాత జిల్లా కలెక్టర్ భవిత కేం ద్రాన్ని తనిఖీ చేసి పనులు పూర్తికా వడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ము ఖాముఖి మాట్లాడి వారికి చాక్లెట్లను పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేం ద్రాన్ని సందర్శించి ఆరోగ్య కేంద్రాని కి వస్తున్న రోగుల వివరాలను, సి బ్బంది, డాక్టర్ల అటెండెన్స్ రిజిస్టర్, ఓపి రిజిస్టర్ తో పాటు, ఆసుపత్రిలో ఉన్న వైద్య సేవలు, పరికరాలు, త దితర వివరాలను అడిగి తెలుసు కున్నారు.
గృహ నిర్మాణ శాఖ పీడి రాజకుమా ర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికా రి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా టి బి అధికారి డాక్టర్ కల్యాణ చక్రవర్తి, డి ఈఓ బిక్షపతి, తహసిల్దార్ పద్మ , ఎంపీడీవో వేదం రక్షిత, కనగల్ స ర్పంచ్ మురళి గౌడ్ తదితరులు జి ల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.




