Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS JagadishReddy : దోచుకోవడం.. దాచుకోవడమేనా..?

–వ్యతిరేకతను అనిచివేసే చిల్లర ప్రయత్నం మోసపోయిన రైతాంగం తరుఫున పోరాటానికి సిద్ధం

— ఈ నెల 28న కేటీఆర్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహిస్తాం
–చిల్లర మల్లర మాటలతో తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తున్నారు
— మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

BRS JagadishReddy : ప్రజాదీవెన, నల్లగొండ బ్యూరో: తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రం లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలతో కలిసి హాజరై మాట్లాడారు. ప్రభుత్వంపై రైతుల్లో, ప్రజల్లో ఉన్న వ్యతి రేకతను అణిచివేయాలనే చిల్లర ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వివిధ పార్టీల మీటింగ్ లను అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని, ప్రభు త్వంపై గ్రామసభల్లో ప్రజల అభిప్రాయాలే నిదర్శనమని వ్యాఖ్యా నించారు.

ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలే నీలాదీస్తున్నారని, పోరాటాలకు సిద్ధపడిన ప్రజలకు నాయకత్వం వహించాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి ప్రజలను దోచుకుంటున్నారని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు కోసమే కేసీఆర్ నిలబడుతున్నారని అన్నారు. ప్రభుత్వం చేతిలో మోసపోయిన రైతంగం తరుఫున కేటీఆర్ ను పిలిచి ఆందోళనకు సిద్ధం అవున్నామని తెలిపారు. కరెంట్ కోతలు, ఎరువుల కొరత, రైతు బంధు, రుణమాఫీపై రైతులు ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

అందుకే క్లాక్ టవర్ సెంటర్ లో కోర్టు అనుమతితో ఈనెల 28న 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ ధర్నా నిర్వహిస్తు న్నామని చెప్పారు.దీనికి పోలీస్ యంత్రంగం, అధికారులు సహకరి స్తున్నారని ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తంచేశారు. రైతులను మోసం చేస్తూ మిలర్ల దగ్గర కమీషన్ తీసుకుంటున్నారని, జిల్లా రైతులను రూ.వెయ్యి కోట్ల వరకూ మోసం చేశారని ఆరోపించారు. ఎక్కడైనా రైతులు ప్రజలు ప్రశ్నిస్తుంటే దాడులు చేయిస్తున్నారని, నల్లగొండకు ఒక్క రూపాయి కొత్తగా తెచ్చింది లేదని, గతంలో కేసీఆర్ ఇచ్చిన నిధులతోను పనులు ముందుకు పోతలేవని దుయ్యబట్టారు. జిల్లా ప్రజలు గమనించి, మంత్రి చేస్తున్న మోసలపై రైతులు కదిలి రావాలని సూచించారు.

మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు ధైర్యముంటే, వ్యవసాయం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తే ఇప్పటి వరకూ కొన్న ధాన్యం ఎంత నో, చెల్లించిన బోనస్ ఎంతనో వివరించాలని సవాల్ విసిరారు. ఇప్ప టివరకూ ఎంత ధాన్యం కొన్నారో చెప్పలేని దద్దమ్మ ప్రభుత్వ మని, ఏ ముఖం పెట్టుకుని రైతుల విషయం మట్లాడుతున్నారో చెప్పాలని అన్నారు. రైతులను చూసి భయపడి పారిపోతున్నారని, ఆంధ్ర నుంచి కొట్లాడి కృష్ణా నీళ్లు తెచ్చి పారించి, రూ.40 లక్షల టన్నుల ధాన్యం పడిచి నల్లగొండను అన్నపూర్ణగా మార్చిన ఘటన బీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు.

గ్రామ సభల లిస్ట్ లపై ప్రభుత్వం తిరోగమనం పట్టిందని, ఇప్పటికే మూడు సార్లు దరఖాస్తు చేస్తే ఆవి ఎటూ పోయాయో. దరఖాస్తు ఫారలు కూడా అమ్ముకునే దౌర్భాగ్యం కాంగ్రెస్ నేతలదని ఆరోపిం చారు. ఐటీ లో మూడు లక్షల ఉద్యోగాలు ఉంటే కేటీర్ 9లక్షలకు చేర్చారని, 40వేల కోట్ల ఐటీ ఎగుమతుల నుంచి 2.40లక్షల కోట్లకు పెంచిన ఘనత కేటీఆర్ కే దక్కుతుందన్నారు. దావోస్ లో పెట్టుబ డులన్నీ ఇంతకు ముందు కేటీఆర్ హయాంలోనే జరిగాయని, మెగా తో ఒప్పందం డెష్టినేషన్ పెళ్లిలా ఉన్నదని ఆరోపించారు.

ప్రభుత్వ తీరుతో తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిం టుందని అన్నారు. టీస్ ఐపాస్ ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిం చిన ఘనత కేటీఆర్ కే దక్కుతుందని అన్నారు. సంచులు మోసిన అనుభవం ఉన్న రేవంత్ లాంటి వాళ్ళ నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేమని అన్నారు. కేటీఆర్ తో దేనిలో పోటీ పడలేరని, చిల్లర చేష్టలు, చిల్లర మాటలతో తెలంగాణ పరువు తెస్తున్నారని ఆవేదన చెందారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజలు నవ్వుకుంటారని, ఏదీ మాట్లాడినా రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమని చెప్పారు.

ఈ మీడియా సమా వేశంలో నల్లగొండ సూర్యాపేట జిల్లాల పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, నల్గొండ మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు గొంగడి సునీత మహేందర్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, చిరుమర్తి లింగయ్య, పైళ్ళ శేఖర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నా యకులు కంచర్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, ఒంటెద్దు నరసింహారెడ్డి, కల్లుగీత రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, చీర పంకజ్ యాదవ్, మాజీ ఆర్వో మాలే శరణ్య రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టే మల్లికార్జున రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.