–గెలుపే ధ్యేయంగా సమాయత్తమ వుతోన్న వైసీపీ అధినేత జగన్
–బలాబలాల దృష్ట్యా వైసిపికే గెలు పు అవకాశాలు
–ఇప్పటికే పోటీ నుంచి తప్పుకుం టున్నట్లు ప్రకటించిన టిడిపి
–ఎమ్మెల్సీ ఉపఎన్నిక వార్ వన్ సై డ్ అయ్యేoదుకు మార్గం సుగమo
JAGAN:ప్రజా దీవెన, విశాఖ: విశాఖ పట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేప థ్యంలో తనకు ఉన్న బలం దృష్ట్యా పట్టు నిలుపుకోవడానికి, సీటు గెల వడానికి వైసీపీ (ycp) సకల ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనిలో భాగం గా ఎమ్మెల్సీ ఎన్నికపై వైసీపీ అధ్య క్షుడు వైఎస్ జగన్ (JAGAN) నిషిత దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఇప్ప టికే ఉమ్మడి విశాఖలో ఐదు నియో జకవర్గాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలతో జగన్ (JAGAN) భేటీ అయ్యా రు. మరో రెండు రోజుల పాటు మి గిలిన నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఉమ్మడి విశాఖ (Joint Visakha) స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో భేటీ కారణంగా ఇత ర నాయకులు జగన్‌ను కలిసేం దుకు అవకాశం లేదని వైఎస్సా ర్‌సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడిం చింది. అధినేతను కలిసేందుకు ఇత ర నేతలు, కార్యకర్తలు, సందర్శకు లు తాడేపల్లికి రావొద్దని పార్టీ ఆఫీ సువర్గాలు సూచించాయి. ఇదిలా ఉండగా ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. భార్య ఝాన్సీ తోపాటు, పార్టీ ముఖ్యనేతలు వెంట రాగా ఆయన విశాఖ కలెక్టరేట్‌కు వెళ్లి నామినేషన్ వేశారు. మాజీ మంత్రులు కన్నబాబు, అమర్నాథ్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, చిన్న శీను కూడా బొత్స నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మె ల్సీ ఎన్నికల్లో విజయం వైఎస్సార్ సీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పోటీ చేయకూడదని కూటమి నిర్ణయం.. విశాఖ ఎమ్మెల్సీ (Visakha MLC) ఉప ఎన్నికల్లో సరైన సంఖ్యాబలం లేనం దున పోటీ చేయకూడదని ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి పార్టీలు నిర్ణ యించాయి. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తానికి మొత్తంగా 850 మంది ప్రతినిధులు ఉండగా అందులో కూటమి పక్షాలకు కేవలం 250 మంది మాత్రమే ఉండడంతో ఎన్నికల రణరంగంలో నిలిచి గెల వడం సాధ్యం కాదన్న అభిప్రాయా నికి వచ్చిన కూటమి పక్షాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అధికారంలో ఉండి మొట్టమొదటి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు అన్న అపవాదులు మూటకట్టుకోవడం కన్నా ఊరుకోవడం ఉత్తమమని విస్తృత స్థాయిలో చర్చల అనం తరం అవే పక్షాల ముఖ్య నాయకులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఎన్నిక ఏకపక్షం.. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఐదేళ్లు (Andhra Pradesh for five years)పరిపాలించిన వైసిపి గెలు చుకోవడం ఖాయం అయింది. కూ టమిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయ కూడదని నిర్ణయం తీసుకున్న నేప థ్యంలో వైసిపికి గెలుపు అవకా శా లు దాదాపు ఖరారయ్యాయి. ఈ క్రమంలో వైసీపీ తరఫున ఉప ఎన్ని కల్లో పోటీ చేస్తున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఇప్పటికే తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. సంఖ్యా బలం లేనందున కూటమి అభ్యర్థి నిలబడపోవడం వారికే మంచిదన్న వ్యాఖ్యలు కూ డా ఈ సందర్భంలో చేశారు. అం దరూ అనుకున్నట్లుగానే కూటమి అభ్యర్థి ఉప ఎన్నికల్లో పోటీ చేయ డం లేదన్న వార్తలు దావనంలో వ్యా పించడంతో వైసిపి పార్టీలో ఆనం దం వ్యక్తం అవుతుంది. దీంతో ఉత్త రాంధ్ర ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఏక ప క్షంగా ముగియనుంది.