–విదేశీ పర్యటనకు అనుమతి వద్దంటే వద్దంటూ అప్పీల్
–అక్రమాస్తుల కేసులో ఆయనే ఎ 1, పర్యటనకు మేం ఒప్పుకోం
–జగన్ విదేశీయానానికి సిబిఐ నో
JAGAN: ప్రజా దీవెన, అమరావతి: బ్రిటన్ వెళ్లేందుకు (To go to Britain)అనుమతినివ్వాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహ న్‌రెడ్డి సీబీఐ కోర్టులో దాఖలు చేసి న పిటిషన్‌పై నేడు వాదనలు జరి గాయి. సీబీఐ తన వాదనలు విని పిస్తూ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి నివ్వవద్దని కోర్టును కోరింది. జగన్ తరపు న్యాయవాదు లు కూడా తమ వాదనలు వినిపిం చారు.
అనంతరం కోర్టు తన నిర్ణ యాన్ని ఈ నెల 27కు వాయిదా వేసింది. విదేశీ పర్యటనకు (Foreign trip) అను మతినివ్వాలని కోరుతూ జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజ యసాయిరెడ్డి వేర్వేరుగా నాంపల్లి సీబీఐ కోర్టులో (CBI Court)పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారణ జరిగింది. యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు జగన్ అనుమతి కోరగా.. యూకే, స్వీడన్, యూఎస్ (UK, Sweden, US) వెళ్లేందుకు అనుమతిని వ్వాలని విజయసాయి కోరారు. అక్రమాస్తుల కేసులో జగన్, విజయ సాయిరెడ్డి ఏ1, ఏ2 నిందితులుగా ఉన్నారు. నిన్న వాదనల అనంతరం విచారణను నేటికి వాయిదా వేసిం ది. నేడు జరిగిన విచారణ అనంత రం జగన్ పిటిషన్ పై నిర్ణయాన్ని కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.