Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jagan Prajadarbar: పులివెందులలో మాజీ సీఎం జగన్ ప్రజాదర్బార్, ప్రజల నుంచి వినతుల స్వీకారం

ప్రజా దీవెన, కడప: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తిరుగుబాటు ను ప్రకటించిన విషయం విధితమే. ఆయా రంగాల వారీగా నిరసన కార్యక్రమాలు, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణ యించిన ఆయన తాను మాత్రం సంక్రాంతి తర్వాత ప్రజల్లో ఉంటా నని, ప్రజల సమస్యల కోసం ప్రభు త్వాన్ని నిలదీస్తానని చెప్పారు కూడా. అయితే ప్రస్తుతం కడప జి ల్లా పర్యటనలో ఉన్న జగన్ పులి వెందులలో ప్రజాదర్బారు ప్రారం భించారు.

పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో గురువా రం ఉదయం ఈ కార్యక్రమాన్ని ఏ ర్పాటు చేశారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులను స్వీక రిస్తున్నారు. జగన్ను కలిసేందుకు అటు రాయలసీమ జిల్లాల నుంచి, ఇటు కడప జిల్లా నుంచి పెద్ద ఎత్తు న కార్యకర్తలు, ప్రజలు తరలి వస్తు న్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను బుధ వారం పులివెందులలోనే జరుపు కున్నారు. తన కుటుంబంతో కలిసి పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ కేక్ను కట్ చేయడంతో పాటు నూతన సంవత్సరం క్యాలెండర్ ను కూడా జగన్ ఆవిష్కరించారు. అ నంతరం కోదండ రాముడి గుడికె ళ్లారు. లింగంపల్లి మండలం తాతి రెడ్డిపల్లిలోని కోదండరాముడి విగ్ర హాలను ప్రతిష్టించారు. అనంతరం పూజారులు ఆయనకు ప్రత్యేక పూ జలు నిర్వహించారు.