Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jagan Raghuramaraj: జగన్ రఘురామరాజు మాటామంతి

–హాయ్ జ‌గ‌న్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించిన రఘురామరాజు
–అసెంబ్లీలో ఆయ‌న సీటు ప‌క్క‌నే సిట్టింగ్ ఇవ్వాలని మంత్రికి వినతి
–ప్ర‌తి రోజూ అసెంబ్లీకి రావాలంటూ హిత‌వు,సానుకూలంగా స్పందించి న జ‌గ‌న్

Jagan Raghuramaraj:ప్రజా దీవెన, అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో (Assembly meeting) ఆదివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్య‌ మంత్రి, వైసీపీ అధినేత‌ జగన్ పై (jagan) ప్రతిరోజు విమర్శలు గుప్పించే టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు (Raghuramaraj) ఆయనతో మాటామంతి జరిపారు.జగన్ అసెంబ్లీ ఆవరణ లోకి వచ్చే సమయానికి అప్పటికే అక్కడ ఉన్న రఘురామ‌రాజు హా య్ జగన్ అని పలుకరించారు. జగ న్ (jagan)ముందుకు కదిలిన తర్వాత ఆయనతో పాటు వెళ్లి, ఆయన వరుసలో కూర్చున్నారు. కాసేపట్లో గవర్నర్ ప్రసంగం ప్రారంభమవు తుందనగా లేచి వెళ్లి జగన్ పక్కన రఘురామ‌రాజు కూర్చున్నారు. జగన్ భుజంపై చేయి వేసి మాట్లా డారు. ప్రతి రోజు అసెంబ్లీకి రావా లని జగన్ కు చెప్పారు. దీనికి సమాధానంగా జగన్ మాట్లాడుతూ రోజూ అసెంబ్లీకి వస్తాను, మీరే చూ స్తారని అన్నారు.ఆ త‌ర్వాత ర‌ఘ‌ రామ అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీకి ప్రతి రోజు రావాలని జగన్ కు చెప్పానని రఘు రాజు మీడియాకు వివరించారు. అ సెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే మజా ఏముంటుందని అన్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ ఇన్నర్ లాబీ లో వెళ్తున్న శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తో మాట్లాడుతూ అసెంబ్లీలో జగన్ పక్కనే తనకు సీటు కేటాయించా లని కోరారు. దీనికి సమాధానంగా అలాగేనని కేశవ్ నవ్వుతూ చెపు తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆ తర్వాత జగన్ (jagan)పక్క సీటును మీరు ఎందుకు కోరుకుంటున్నారని రఘురామ‌రాజును మీడియా ప్రశ్నించగా మజా ఉంటుందని, మీరే చూస్తారుగా అని వ్యాఖ్యానిం చారు. జగన్ ను రోజూ ర్యాగింగ్ చేస్తారా అని పక్కనే ఉన్న మరో ఎమ్మెల్యే ప్రశ్నించగా ర్యాగింగ్ చేస్తానో, మరేం చేస్తానో మీరే చూస్తారుగా అని అన్నారు. జగన్ కు షేక్ హ్యాండ్ ఎందుకిచ్చారని మీడియా ప్రశ్నించగా అది తన ధర్మం అని చెప్పారు. మీ షేక్ హ్యాం డ్ (Shake Hand) పట్ల జగన్ పాజిటివ్ గా రెస్పాం డ్ కాలేదని మరికొందరు ఎమ్మెల్యే లు వ్యాఖ్యానించగా జగన్ ఎలా రెస్పాండ్ అయినా, ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం తన ధర్మమని అన్నారు. అసెంబ్లీలో జగన్ పక్కన తనకు సీటు కేటాయిస్తే ఆయనకు అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెపుతానని తెలిపారు.

శాంతి భ‌ద్ర‌త‌ల‌పై జ‌గ‌న్ మాట్లాడ‌ టం హాస్యాస్ప‌దం

రాష్ట్రంలో శాంతిభద్రతలపై (law and order)జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉంద న్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు. ఢిల్లీలో ధర్నా చేస్తా నని అంటున్నారని, ఏపీలో రాష్ట్రప తి పాలన విధించాలని అంటున్నా రని, అసలు జగన్ చేస్తున్న ఈ డిమాండ్ ఏమిటో తనకు అంతు పట్టకుండా ఉందని చెప్పారు.

వినుకొండలో జరిగిన హత్యను ఒక పెద్ద సమస్యగా చిత్రీకరిస్తూ ముఖ్య మంత్రి చంద్రబాబుపై (chandra babu) జగన్ విమ ర్శలు చేయడం సరికాదని అన్నా రు. రాష్ట్రంలో జగన్ కు ప్రజాభిమా నం తగ్గలేదని చూపించుకునేందుకు కొందరికి డబ్బులిచ్చి, వారిని తీసు కొచ్చి, వారితో జగన్ కు దండాలు పెట్టించి, వాటిని పత్రికల్లో రాయిం చుకుంటున్నారని విమర్శించారు. నాగార్జునసాగర్ నిర్మాణానికి భూ ములు, నిధులు ఇచ్చిన రాజా వాసి రెడ్డి రామగోపాల్ కృష్ణ మహేశ్వ రప్రసాద్ విగ్రహాన్ని ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.