–పులివెందుల పర్యటనలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి
–జగన్ పర్యటనతో సందడిగా మారిన పులివెందుల
Jagan: ప్రజా దీవెన, కడప: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jagan) సొంత నియోజకవర్గమైన కడప జిల్లా పులివెందుల (Pulivendula) పర్యటన యావత్తు సందడిగా మారింది. కడప జిల్లా పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదివారం పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించారు. జగన్ పులివెందులకు రావడంతో నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు కడప, అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు (Kadapa, Annamayya, Anantapur, Chittoor) తదితర జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో పులివెందుల సందడిగా మారింది. తన క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న జగన్ కార్యకర్తలతో, నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
తమకు టీడీపీ నేతల (TDP leaders) నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలామంది కార్యకర్తలు జగన్ దృష్టికి తెచ్చారు. నియోజకవర్గాల వారీగా ద్వితీయ శ్రేణి నాయకులు జగన్‌తో భేటీ అయ్యారు.రాజకీయ పరిణామాలపై చర్చ..మొదటగా పులివెందుల కు చెందిన నేతలతో వైయస్ జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నాయకులను జగన్ పేరుపేరునా పలకరించారు. ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారు ప్రస్తావించిన అంశాలను కడప ఎంపీ అవినాష్ రెడ్డి నోట్ చేసుకుంటూ కనిపించారు.
అనంతరం కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి (P Rabindranath Reddy,), ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ (Ramesh Yadav), జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (Sudhir Reddy) తదితరులు జగన్ తో సమావేశం అయ్యారు. ప్రస్తుత జిల్లా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా..ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తోపాటు అనంతపురం జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నాయకులు జగన్ తో భేటీ అయ్యారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ నాయకులు కూడా జగన్ తో సమావేశం అయ్యారు.