–వైసీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్న పోలీ సులు
–వారి చేతుల్లో ఉన్న ప్లకార్డులు, పే పర్లు లాక్కుని చింపేసిన పోలీసులు
Jagan: ప్రజా దీవెన అమరావతి: ఆంద్ర ప్రదేశ్ వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ (State Assembly)వద్ద కొద్ది సేపు గందరగోళం నెల కొంది. ప్రతిపక్ష వైసిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను (MLAs and MLCs)అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు (police) అడ్డుకోవడంతో వాగ్వి వాదం చెలరేగింది. మా చేతుల్లో ఉన్న ప్లే కార్డులు, పేపర్ లు చించివేసి మమ్మల్ని అడ్డు కునే అధికారం ఎవరిచ్చారని వైస్ జగన్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచి ది కాదని పోలీసులను పేరుతో పిలి చి మరీ హెచ్చరించారు. తదనంత రం కొద్ది సేపటి తర్వాత మా జీ ముఖ్యమంత్రి వైయస్ జగ న్‌మోహ న్‌రెడ్డి తమ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల తో కలసి అసెంబ్లీ ప్రాంగణం (Assembly premises) చేరు వకు చేరుకున్నారు.
వైయస్ జగన్ తో సహా, మెడలో నల్ల కండువాలు (Black scarves) ధరించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ‘సేవ్ డెమొక్రసీ’ అంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీ వైపు అడుగులు వేశారు. అసెంబ్లీ గేటు (Assembly Gate)వద్ద పోలీ సుల వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.పోలీసుల ఝులుం ఎల్లకాలం సాగబోదని వైయస్ జగన్ (YS Jagan)వ్యాఖ్యానించారు. పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కానీ, యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కోసం కాదన్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్లు లాక్కుని, చింపే అధి కారం ఎవరిచ్చారని గట్టిగా నిలదీశారు.