Jagdeep Dhankhad: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కోల్‌కతా లో ట్రైనీ డాక్టరుపై అత్యాచారం చేసి, హత్య చేసిన (Raped and murdered)సంఘటనను తక్కువ చేసి చూపారంటూ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్య సభ సభ్యుడు కపిల్ సిబల్‌ను ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhad)తప్పు పట్టారు. ఆ దుర్ఘటనపై ప్రజానీక మంతా సిగ్గుతో తలవంచుకున్న సమయంలో కొందరు మాత్రం పుండుపై కారం చల్లారని విమ ర్శించారు.
కోల్‌కతా సంఘటనపై సుప్రీంకోర్టు (Supreme Court)బార్ అసోసియేషన్ అధ్యక్షుని హోదాలో సిబల్ వ్యా ఖ్యానిస్తూ ‘అది దుర్బుద్ధికి సూచిక’ అని పేర్కొన్నారు. అలాంటివి సాధారణంగా జరుగుతుంటాయ న్నారు. దీనినే ఉపరాష్ట్రపతి (Vice President)తప్పు పట్టారు. ఆదివారం రిషీకేష్ ఎయి మ్స్‌లో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ సిబల్ తమ ఆలోచనలను మార్చుకొని బహి రంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ (demand)చేశారు. ఇలాంటి సంఘ టనలను రాజకీయ కోణంలో చూ డకూడదని చెప్పారు. పని స్థలాల్లో వైద్యులకు రక్షణ కల్పించాల్సి ఉందని అన్నారు.