జమిలి ఎన్నికలకు మోడీ రెడీనా…!?
ప్రజా దీవెన/న్యూ ఢిల్లీ: భారత దేశంలో ఒకేసారి (జమిలి) ఎన్నికలకు మోడీ ప్రభుత్వం సిద్దమవుతోంది అనే ప్రచారం రోజు రోజు కు బలం చేకూరుతోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు మే నెలకు బదులు నవంబర్ , డిసెంబర్ కు ముందుకు జరుగబోతున్నాయనే మాట ఆ నోట ఈ నోట దవానంలా వ్యాపిస్తోంది.
అలాంటి ప్రచారాలకు. చర్చలకు మద్దతు పలుకుతూ మొత్తానికి ఔననే సమాధానం లభిస్తుంది. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే జమిలీ ఎన్నికలకు మోడీ స్కెచ్ గీస్తున్నట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది.జమిలీ ఎన్నికల అంటే ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరపడం కాదని అందుకు కాస్త అటూ ఇటూ ఉన్న సరాసరి రాష్ట్రాలను ముందుకు వెనక్కి జరిపి ఒకేసారి ఎన్నికలు జరపడం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
జమిలి ఎన్నికల నిర్వహణ ద్వార ఎన్నికల ఖర్చు గణనీయంగా తగ్గించేoదుకు అవకాశం లభిస్తుంది దేశంలోని 11 లేదా 13 రాష్ట్రాల ఎన్నికలను ఒకేసారి జమిలీ ఎన్నికలుగా నిర్వహించేందుకు మోడీ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జమిలి ఎన్నికల కోసం చట్టం చేస్తే, చట్టం చేయకపోతే పరస్పర విరుద్ధoగా ఉంటుంది. ఎన్నికల కోసం ప్రత్యేకంగా చట్టాలు చేయకున్నా జమిలి ఎన్నికలు నిర్వించవచ్చని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.