–మూడు దశల్లో జమ్ము కశ్మీర్ లో ఎన్నికల పోలింగ్
— సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీలో ఎన్నికలు
–హర్యానా అసెంబ్లీకి సైతo అక్టో బర్ ఒకటో తేదిన పోలింగ్
— జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలకు అనుకూలం వాతావరణం
— సానుకూలత ఉండడంతో పోలిం గ్‌కు తేదీల ప్రకటన
Jammu and Kashmir Elections: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) తర్వాత మరోసారి దేశం లో ఎన్నికల నగారా మోగింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసిం ది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడి యాకు నేడు వివరాలు తెలిపారు. హర్యానా విధానసభ పదవీకాలం నవంబర్ 26తో ముగియనుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలచేశారు. అక్టోబర్ 1వ తేదీ న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు( Haryana Assembly Elections)నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన ఫలితాలు వెలువరిస్తా మని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చేస్తు న్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చిన విషయం తెలిసిందే. దీంతో జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్, లఢఖ్ కేంద్రపాలిత ప్రాంతా లుగా విభజించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు జమ్మూకశ్మీర్‌లో (Jammu and Kashmir) వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే కమి షన్ బృందం లోయను సందర్శిం చింది. అక్కడ అన్ని రాజకీయ పార్టీలతో భేటీ అయ్యి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను తీసుకుంది.
మూడు దశలలో జమ్ము కశ్మీర్‌కు ఎన్నికలు ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha election)జమ్మూ కశ్మీర్‌లో 58.58 శాతం పోలింగ్ నమోదు కావడంపై ఈసీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. మూడు నాలుగు దశాబ్దాల్లో ఈసారే కశ్మీర్ లో ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరిగాయి. ప్రజలు ఓటింగ్‌కు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఎన్నికలు ఇప్పుడే నిర్వహించాలని ఈసీ నిర్ణ యించింది. కాగా గతంలో జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో 107 స్థానా లుండగా ఇప్పుడు 114కు పెరిగా యి. వీటిలో 24 సీట్లు పాక్ ఆక్రమి త కశ్మీర్‌లో ఉండగా మిగతా 90 స్థానాలకు ఎన్నికలు జరగను న్నాయి. వీటిల్లో జమ్ము ప్రాంతంలో 43 స్థానాలు, కశ్మీర్ వ్యాలీలో 47 స్థానాలు ఉన్నాయి. ఇక జమ్ము కాశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ చీఫ్ కమిష నర్ రాజీవ్ కుమార్ (Rajeev Kumar) వెల్లడించారు. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీ న జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.