–ఎన్నికల ముందు ఇచ్చిన హామీ లన్నీ అమలు చేసి తీరుతాం
–తెలంగాణలో వ్యవస్థలన్నింటిని సర్వనాశనం చేసింది మీరు కాదా
–బిఆర్ఎస్ నేత హరీష్ వ్యాఖ్యల పై మంత్రి శ్రీధర్ ఫైర్
Job calendar:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో (TELANGANA)గడిచిన పదేళ్ల పరిపాలన లో వ్యవస్థలన్నిటిని సర్వనాశనం చేసింది మీరుకాదా రాష్ట్ర ఐటీ (IT), పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (SRIDAR BABU) ఆగ్రహం వ్యక్తం చేశారు.చేసిన దుర్మార్గాలను గాడి నపెట్టడం సమస్యగా మారిందని, ఇప్పుడిప్పుడే దారిలో పడుతున్నా మని బీఆర్ఎస్ (BRS) నేతలు , మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీష్ రావు (HARISH RAO)లపై ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతీ మాటకు కట్టుబడి ఉన్నామనీ, మీ రు వదిలిన అరాచకాలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నా రు. సోమవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ పింఛన్ల విషయం లో ఎపీ సీఎం చంద్రబాబును (CM CHANDRA BABU)హరీ ష్ రావు ఉదాహరణగా తీసుకు న్నారంటేనే ఆయన పరిస్థితి అర్థ మవుతుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆలోచనలను అమలు చేస్తాము తప్ప ఏపీ ఆలో చనలు కాదని స్పష్టం చేశారు. మీ హయాంలో తెలంగాణ పబ్లిక్ సర్వీ స్ పరీక్షలను అవకతవకలతో చేప డితే, తాము 12 ఏళ్ల తర్వాత గ్రూప్ -1 పరీక్షను ఎలాంటి లోటు పాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. త్వరలో జాబ్ క్యాలెండర్ (Job calendar) విడుదల చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్ల డించారు. తమ ప్రభుత్వం అధికా రం చేపట్టిన మూడు నెలలకే ఎలక్ష న్ కోడ్ వచ్చిందనీ, ఈ నెలలోనే ముగిసిందని తెలిపారు. ఇప్పుడి ప్పుడే పాలనపై పట్టు సాధించామ నీ, ప్రజలకు ఇచ్చిన హామీలు అమ లు చేస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్ రావు కు లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గుర్రాలతో ఆశావ ర్కర్ను తొక్కించారని ఆరోపిం చారు. పెద్దపల్లిలో జరిగిన ఘట నపై విచారణ జరుగుతుందని చె ప్పారు. ఈ ఘటన జరగడం దుర దృష్టకరమని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల విషయంలో ప్రభు త్వం సీరియస్ గా ఉందనీ, మత ఘర్షణల విషయంలో సీరియస్ గా ఉన్నామనీ, వాటి వెనక ఎవరి హ స్తం ఉన్నా ఉక్కు పాదంతో అణిచి వేస్తామని శ్రీధరాబాబు (SRIDAR BABU) హెచ్చరించా రు.