–రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Minister Komatireddy Venkata Reddy :
ప్రజా దీవెన, నల్లగొండ: వివిధ సాం కేతిక కోర్సులలో శిక్షణ పొందడం ద్వారా ఉద్యోగాలు పొందవచ్చని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి అన్నారు. శనివారం ఆయ న నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐటిఐ ప్రాంగణంలో సుమారు 42.5 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేం ద్రా న్ని ప్రారంభించారు.రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి 2400 కోట్ల రూపాయల వ్యయంతో 65 ఏటిసి కేంద్రాలను వర్చువల్ ప ద్ధతిలో ప్రారంభించిన అనంతరం నల్గొండలో మంత్రి నల్గొండ ఏటిసి ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స మావేశంలో మంత్రి మాట్లాడుతూ టాటా సహకారంతో ఏటీసీలు ఏ ర్పాటు చేయడం జరిగిందని, న ల్గొండ ఏ టి సి ని సుమారు 42.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమాజంలో నిరు ద్యోగ సమస్య వల్ల యువత పక్క దారి పడుతుందని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి యువతకు పెద్ద ఎ త్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏటీసీలను ఏర్పాటు చేశారని, యువతకు టీఎస్పీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పి స్తునే ఒక వైపు ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఉద్యోగ ఉపాధి అవ కాశా లను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తు న్న దని తెలిపారు.
యువత కష్టపడి చదవాలని, త ద్వారా ఉద్యోగాలు సాధించవచ్చని అన్నారు. ఏటిసి పక్కనే 20 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన న్యాక్ భవనంలో మహిళల కు పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుం టామన్నారు. మీ భవిష్యత్తు మీ కష్టం పైన ఆధారపడి ఉంది. అందు వల్ల నాలుగు సంవత్సరాలు బాగా కష్టపడి చదువుకుంటే 40 సంవత్స రాలు సుఖపడతారు. అని ఈ సం దర్భంగామంత్రి యువతకు తెలిపా రు. నల్గొండ జిల్లా జల సంరక్షణలో జాతీయ అవార్డు సాధించడం పట్ల ఆయన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ ని అభినందించారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లా డుతూ ఒకేషనల్ శిక్షణ ఉంటే ఉ ద్యోగ అవకాశాలు మెరుగుపడతా యని అన్నారు. డిగ్రీ ఇతర చదు వుల ద్వారా మాత్రమే కాకుండా సాంకేతిక విద్య ద్వారా ప్రభుత్వ ఉద్యోగం తో పాటు, ప్రైవేటు ఉ ద్యోగాలు పొందవచ్చు అన్నారు. ఏటీసీలలో శిక్షణ పొందిన వారికి భవిష్యత్తులో పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలి పా రు.
నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి పద్మ, ఏ టి సి ప్రిన్సిపల్ నరసింహ చారి, లైబ్రరీ చైర్మన్ ఆఫీజ్ ఖాన్, డిసిసి డైరెక్టర్ సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చై ర్మన్ జూపూడి రమేష్, టి జి ఐ ఐ సి జోనల్ మేనేజర్ సంతోష్ కు మార్, తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.